హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubabad:లవ్ ఫెయిలై సూసైడ్ చేసుకున్న కొడుకును దేవుడ్ని చేశారంతే..విగ్రహానికి వివాహం చేస్తున్నారంట

Mahabubabad:లవ్ ఫెయిలై సూసైడ్ చేసుకున్న కొడుకును దేవుడ్ని చేశారంతే..విగ్రహానికి వివాహం చేస్తున్నారంట

( కొడుకు విగ్రహానికి పెళ్లి)

( కొడుకు విగ్రహానికి పెళ్లి)

Variety News:కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మరికొన్ని వార్తలు వింటుంటేనే కొత్తగా ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో సరిగ్గా అలాంటి వార్తే ఇప్పుడు వైరల్ అవుతోంది. 17ఏళ్ల క్రితం లవ్ ఫెయిల్ కావడంతో సూసైడ్ చేసుకున్న కొడుకు విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించి శ్రీరామనవమి రోజున పెళ్లి చేస్తున్నారు తల్లిదండ్రులు.

ఇంకా చదవండి ...

దేవుళ్లకు గుడి కట్టించడం చూశాం. చరిత్రలో నిలిచిపోయే త్యాగధనులు, ఎందరో మహానుభావులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం విన్నాం. మనుషులు బ్రతికి ఉంటేనే పెళ్లి చేస్తారు. కాని ఆ తల్లిదండ్రులు దాదాపు 17ఏళ్ల క్రితం(17Years ago) చనిపోయిన తమ బిడ్డకు వివాహం జరిపించారు. అదేంటి చనిపోయిన వ్యక్తికి పెళ్లేంటి అని ఆశ్చర్యపోకండి..అతని విగ్రహాన్ని ఏర్పాటు చేసి..దానికో గుడి కట్టి అందులో అతనికి నచ్చిన అమ్మాయి విగ్రహం ఏర్పాటు చేసి..సరిగ్గా శ్రీరామనవమి (Sriramanavami)రోజున రాములవారి కల్యాణం జరిగే సముహూర్తానికే చనిపోయిన బిడ్డ(Dead son)కు వివాహం జరిపించారు. వినడానికే విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. తెలంగాణ (Telangana)రాష్ట్రం మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని బయ్యారం (Bayyaram)మండలం సంత్రాల్‌పోడ్ తండా (Santralpod Tanda)కు చెందిన రాంకోటి(Ramkoti)కి తల్లిదండ్రులు సుక్కమ్మ(Sukkamma), లాలు (Lalu) దంపతులు ఏటా ఇదే విధంగా తమ బిడ్డ పెళ్లిని జరిపిస్తూ వస్తున్నారు. 2004సంవత్సరంలో రాంకోటి చనిపోయాడు. ఇంటర్(Inter)చదువుతున్న రాంకోటి ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇంతలోనే తన లవ్ ఫెయిలవడం(Love Fail)తో ..ప్రియురాలితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదిగొచ్చిన కొడుకు బలవన్మరానికి పాల్పడం ఆ తల్లిదండ్రుల్ని తీవ్రంగా కలచివేసింది. బిడ్డను తలుచుకుంటూ సుక్కమ్మ, లాలు కొంతకాలం గడిపారు.

చనిపోయిన కొడుక్కి పెళ్లి..

అయితే కొడుకు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని గ్రహించారు. అందుకే చనిపోయిన తమ కొడుకు రాంకోటిని ఎప్పుడూ కళ్ల ముందే ఉండేలా చూడాలనుకున్నారు. అందులో భాగంగానే తమ ఇంటి ఆవరణలోనే చిన్న గుడి కట్టించారు లాలు,సుక్కమ్మ దంపతులు. ఆ తర్వాత అందులో తమ కొడుకు రాంకోటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాదు అతను ప్రేమించిన అమ్మాయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి రోజు పూజలు చేస్తున్నారు ఆ దంపతులు.

దేవుడిగా కొలుస్తూ విగ్రహానికి వివాహం..

కొడుకు చనిపోవడంతో భగవంతుడి దగ్గరకు చేరుకున్నాడనే ఫీలింగ్‌తో ఓ దేవుడిలా కొలుస్తున్నారు. గుడిలో ఉన్న రాంకోటి, అతని ప్రియురాలు విగ్రహాలకు రోజు పూజలు చేయడం,విగ్రహాల్ని అలంకరించడం చేస్తున్నారు. రాంకోటి చనిపోయిన మరుసటి ఏడాది అంటే 2005నుంచి సుక్కమ్మ, లాలు దంపతులు తమ బిడ్డ విగ్రహానికి పెళ్లి చేస్తున్నారు. అది కూడా శ్రీరామనవమి రోజున చేస్తూ గ్రామానికి చెందిన ఆత్మీయులు, బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానించి వారి సమక్షంలోనే చనిపోయిన కొడుకు విగ్రహానికి వివాహం జరిపిస్తున్నారు. ఇదెక్కడి పద్దతి అని కొందరు ప్రశ్నిస్తే తమ కొడుకు రాంకోటి పెండ్లి కాకుండానే చనిపోవడం వల్ల దేవుడిగా భావించి ఏటా వివాహం చేస్తున్నట్టు ఆ తల్లిదండ్రులు తమ గుండెల్లో దాచుకున్న బిడ్డపై ప్రేమను ఈ విధంగా అందరికి చూపిస్తున్నారు.

First published:

Tags: Mahabubabad, VIRAL NEWS

ఉత్తమ కథలు