Santosh, News18, Warangal
వరంగల్ జిల్లా (Warangal) కేంద్రంలో వడ్డీ వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది అవసరం కోసం విలువైన ఆస్తి పత్రాలు లేక ఏవైనా విలువైన వస్తువులు పెట్టుకొని అధిక వడ్డీతో డబ్బులు ఇచ్చి సొమ్ము చేసుకునేవారు ఈ విషయంపై గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి కొంతమంది ఇక వడ్డీ మరియు చిట్ ఫండ్స్ కంపెనీలపై వివిధ రకాల కేసులు కూడా నమోదు చేశారు. అయినా కూడా పేదవారి నడ్డి విరిచేవిధంగా వ్యవహరిస్తున్నారు వడ్డీ వ్యాపారులు. అయితే కొంతమంది వడ్డీ వ్యాపారాలను హెచ్చరిస్తూ హన్మకొండ శివారు ప్రాంతంలోని చింతగట్టు క్యాంపు వద్ద దర్శనమిచ్చాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వడ్డీ వ్యాపారుల తీరుమార్చుకోవాలంటూ కరపత్రాల్లో హెచ్చరికలుజారీ చేసినట్టుగా ఉన్నాయి.
ఇక వడ్డీ వ్యాపారులు బాధితుల రక్తాన్ని తాగుతున్నారని ఆ పత్రంలో పేర్కొన్నారు.అధిక వడ్డీ వ్యాపారానికి పాల్పడుతున్న వారి కొంత మంది పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి వారి పేర్లు డిష్ లక్ష్మణ్ ,డిష్ శ్రీనివాస్, ఆకుల సారంగపాణి , ఆకుల కిరణ్ ,ఆకుల బిక్షపతి ,యాదగిరి గా ఉన్నాయి అధిక వడ్డీ వ్యాపారులు వేధింపులు భరించలేక కొంతమంది పరారీలో ఉన్నట్టు ఈ కరపత్రాల ఘటన స్థానికంగా చర్చ నీయంశం అయింది.
అయితే కొంతమంది వడ్డీ వ్యాపారులు పేదల నడ్డి విరిచే విధంగా ధన దాహంతో వ్యవహరించడాన్ని పద్ధతి మార్చుకోకపోతే తగిన శాస్తి తప్పదంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. ప్రజల చేతిలో శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. నగరంలో కరపత్రం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలసిన ఈ కరపత్రాలు మావోయిస్టులు వేసినవా? లేక ఎవరైనా గుర్తుతెలియని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు అయితే ఈ విషయంపై ఎలాంటి పరిణామాలు తెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal