హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: చిన్నారులపై అఘాయిత్యాల అడ్డుకట్టకు ఆన్ లైన్ సేవలు

Warangal: చిన్నారులపై అఘాయిత్యాల అడ్డుకట్టకు ఆన్ లైన్ సేవలు

X
చిన్నారులపై

చిన్నారులపై అఘాయిత్యాలు

Warangal: చిన్నారులను చిదిమేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ.. శ్రేయోభిలాషులు, బంధువులు, ట్యూషన్ మాస్టార్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై ఈ దుర్మార్గులు వికృత క్రీడకు తెరలేపుతున్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santhosh, News 18, Warangal

చిన్నారులను చిదిమేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ.. శ్రేయోభిలాషులు, బంధువులు, ట్యూషన్ మాస్టార్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై ఈ దుర్మార్గులు వికృత క్రీడకు తెరలేపుతున్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులు పని కోసం బయట వెళ్ళారు. ఇంటి పక్కన ఉన్న పెద్దాయిన వారి పాపపై కన్నేశాడు. చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న పాపపై ఇలాంటి అఘాయిత్యమే, బడిలో చదువుతున్న పాపపై మాస్టర్ కన్ను, పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్తున్న చిన్నారిపై ఓ కుర్రాడు అకృత్యం.

గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డు ప్రాణాన్నికూడా చిదిమేస్తున్నారు కామాందులు. పిల్లల జీవితాలను ఛిద్రం చేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ.. శ్రేయోభిలాషులు,బంధువులు, ట్యూషన్ మాస్టార్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై వికృత క్రీడకు తెరలేపుతున్నారు. ఇలాంటి పరిణామాలు సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ఇలాంటి ఘటనలపై తీవ్ర వేదన వ్యక్తం చేస్తూ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం POCSO చట్టాన్ని రూపొందించింది. వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

2012లో వచ్చిన ఫోక్సో చట్టం (The Protection of Children from Sexual Offences Act, 2012) 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించారు . వారిపై అత్యాచారం పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు.

మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం ప్రభుత్వం కాలపరిమితిని సూచించింది. తప్పనిసరిగా రెండు నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది.

చాలామంది చిన్న పిల్లలు లైంగికవేధింపులు ఎదుర్కొంటునప్పటికీ వారిని గుర్తించలేకపోతున్నారు. దీంతో కీచకులపై ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. ఇదే దుర్మార్గులకు అనుకూలంగా మారింది. ముద్దు, లైంగిక చర్యకు ప్రేరణ, రహస్య భాగాలను తాకడం, నగ్నచిత్రాలను చూపడం వంటివి వేధింపుల్లో భాగమేననే విషయం చిన్నారులకు తెలియడం లేదు. చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే వారు కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులై ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.

ఐతే పరువు కోసం ఆలోచించి చాల మంది కుటుంబాల్లో కుమిలిపోతున్నారు అలంటి వారికోసమే ఆలోచించి లింగిక వేధింపులకు గురయ్యే వారికోసమే POCSO ఈ బాక్స్ అని ఒక ఆఒన్లినె శవాలను ప్రారంబించారు ఇకపై ఎలాంటి భయం లేకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని పిల్లలు లింగిక వేధింపులకు గురివుతున్నప్పుడు ఒక రకమైన ప్రమాదకర ప్రవర్తనను ఎదురుకోవలసి వస్తుందని కాబట్టి సమస్యని ముందుకొస్తే వారికి శిక్ష పడీ మరొకరు చేయకుండా వెనకడుగు వేసే అవకాశముందని బాలల సంరక్షణ కమిటి ఛైర్పర్సన్ వసుధ అంటున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు