waranagal : చెల్లెలి ఫ్రెండ్ అని ప్రేమించాడు.. కాని ఆమె చేసింది వింటే షాకే మరి..! ఇది నిజంగా సినిమా స్టోరిని తలపిస్తోంది...!

ప్రతీకాత్మక చిత్రం

waranagal : అమ్మాయిలు మరి.. షార్ప్‌గా తయారయ్యారు..స్కూళ్లో పరిచయమైన ఓ అబ్బాయి అమాయకత్వంతో అమ్మాయి, సినిమా స్టైల్లో ఆటాడుకుంది..అయితే అది రివర్స్ అయి..యువకుడి ప్రాణాలు బలిగొనే వరకు వెళ్లింది..దీనికి సంబంధించి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

  • Share this:
    వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో ముగ్గురు అమ్మాయిల ప్రేమ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది..అయితే దీని వెనక ఓ సినిమాను మించిన స్టోరీ బయట పడింది..అబ్బాయిని వేధించింది ముగ్గురు అమ్మాయిలు కాదు..ఒకే అమ్మాయి మూడు నెంబర్లతో ఆ యువకుడిని ట్రాప్‌ చేసినట్టు తెలుస్తోంది..కనిపిస్తూ..ఒక అమ్మాయి, కనిపించకుండా మరో ఇద్దరు అమ్మాయిల పేర్లు ,వేర్వేరు ఫోన్ నంబర్లతో అబ్బాయిని మోసం చేస్తూ ఫోన్‌లో మాట్లాడింది..దీంతో అబ్బాయిని ప్రేమిస్తూనే మరో పెళ్లి చేసుకుని విడాకులు సైతం తీసుకుంది..విడాకుల తర్వాత తెలియని అమ్మాయిలతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది..ఇలా అమ్మాయి ట్రాప్‌లో పడిన యువకుడి ఆమె మోసాన్ని గ్రహించని అయాయకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే...వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన సందీప్ కుమార్ ప్రస్తుతం మహబుబ్‌బాద్‌లో ల్యాబ్‌టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో తన చెల్లెలి క్లాస్‌మేట్ అయిన స్రవంతి అనే అమ్మాయి పరిచయం ఏర్పడింది. దీంతో వారు ఫోన్లో మాట్లాడుకుంటూ స్నేహితులుగా మారారు. దీంతో సందీప్‌కుమార్‌ను ప్రేమిస్తున్నానంటూ చెప్పింది..దీంతో యువకుడు సైతం ఓకే అన్నాడు. ఇలా ప్రేమ పేరుతో రోజు ఫోన్లో మాట్లాడుకున్నారు..

    అయితే ఇక్కడే స్రవంతి తన అతితెలివి చూపించింది..సందీప్‌కుమార్ వ్యక్తిగత అంశాలను తెలుసుకునేందుకు కావ్య, మనిషా అనే పేర్లతో పాటు వేర్వేరు ఫోన్ నంబర్లతో సందీప్‌కు ఫోన్ చేయడం ప్రారంభించింది. ఇలా స్రవంతితోపాటు మరో ఇద్దరు అమ్మాయిల పేరుతో కూడా తాము కూడా ప్రేమిస్తున్నామని చెప్పింది..ఇలా మూడు పేర్లతో సందీప్ కుమార్ ను ఓ ఆట ఆడుకున్నారు..నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నాడనే కోణంలో అత్యాశకు వెళ్లింది..

    అయితే ప్రేమ మాయలో పడిని సందీప్ ఒకే అమ్మాయి ఇలా మాట్లాడుతుందని గుర్తించలేకపోయాడు. దీంతో వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతోంది. కాని ఫిజికల్‌గా ఎవరిని చూడకుండానే వ్యవహారం కొనసాగుతోంది. మరోవైపు ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నానని చెప్పినా... తాను మాత్రం మొదట పరిచయమైన స్రవంతినే ప్రేమిస్తున్నానని చెప్పెవాడు.

    కాని ఒరిజినల్ అమ్మాయి అయిన స్రవంతికి ఆరు నెలల క్రితమే పెళ్లి కూడా అయినట్టు తెలుస్తోంది..అయినా ఆమె సందీప్‌కు ఫోన్ చేస్తూ ఉండేది. ఇలా ముగ్గురు పేర్లతో రోజు ఫోన్ చేస్తూ మాట్లాడేది..అయితే స్రవంతికి పెళ్లి కావడంతో సందీప్ పెళ్లి ప్రస్తావనను మానుకున్నాడు. అయితే ఇక్కడే యువతి గేమ్ ఆడింది. స్రవంతి భర్తను వదిలేసి వచ్చిందని తిరిగి ఆమెను పెళ్లి చేసుకోవాలని వేరే ఇతర పేర్లతో ఉన్నవారి నెంబర్లతో ఒత్తిడి పెంచింది.

    కాని పెళ్లి అయిన సందీప్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు..తాను ప్రేమించినా కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అందుకు అంగీకరించలేదు..దీంతో స్రవంతి ప్రతి రోజు ఏదో ఒక రకంగా మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తు బ్లాక్ మెయిల్ చేసింది..ఇలా యువతి బ్లాక్ మెయిల్‌కు తట్టుకోలేని సందీప్ ఈ నెల 12 పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చికిత్స పొందుతూ..గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published: