హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: అనుమానాస్పద స్థితిలో నెలన్నర శిశువు మృతి

Warangal: అనుమానాస్పద స్థితిలో నెలన్నర శిశువు మృతి

వికటించిన సూదిమందు

వికటించిన సూదిమందు

Telangana; నెక్కొండ మండలం కొత్తూరు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో నెలన్నర శిశువు మృతి చెందింది. నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన రామకృష్ణ రచన దంపతులకు ఇటీవల ఆడ శిశువు జన్మించింది. ఈ క్రమంలో రచన కొత్తూరులో అమ్మమ్మ ఇంటి వద్దకు వచ్చి ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : వరంగల్

నెక్కొండ మండలం కొత్తూరు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో నెలన్నర శిశువు మృతి చెందింది. నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన రామకృష్ణ రచన దంపతులకు ఇటీవల ఆడ శిశువు జన్మించింది. ఈ క్రమంలో రచన కొత్తూరులో అమ్మమ్మ ఇంటి వద్దకు వచ్చి ఉంది. కాగా 45 రోజుల పాపకు గ్రామంలో హెల్త్ సెంటర్ కు తీసుకువెళ్లి నెల ఇంజక్షన్లు వేయించారు. సుమారు గంటకుపైగా సెంటర్లోనే ఉన్నారు. ఆ తర్వాత శిశువును ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అస్వస్థకు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే వైద్యులు పరీక్షలు చేయగా శిశువు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు అన్నారని తల్లిదండ్రులు రచన రామకృష్ణ తెలిపారు. అయితే ఇంజక్షన్ వికటించడం వల్లనే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పిహెచ్ సీ వైద్యులు ఇంజక్షన్ వికటించి ఉండకపోవచ్చునని, ఘటనపై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. శిశువు కుటుంబాన్ని పలువురు పరామర్శించారు.

చికిత్స పొందుతూ కరీంనగర్ జిల్లాకు చెందిన జీవిత ఖైదీ మృతి....

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జీవిత ఖైదీ గడ్డం శ్రీను మృతి చెందినట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు. 2007 జూలైలో అదనపు సెషన్ జడ్జి శిక్ష విధించడంతో అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన అనారోగ్య కారణంతో అతడిని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు