Old age couple suicide : కన్నవారికి భారం కాలేక వృద్ద దంపతుల ఆత్మహత్య

couple suicide : కన్నవారికి భారం కాలేక వృద్ద దంపతుల ఆత్మహత్య

Old age couple suicide : కొడుకు భారం కాలేక వృద్ద దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వృద్దాప్యానికి తోడు అనారోగ్యానికి కూడా గురవుతుండడంతో తమ సంతానంలో ఎవరికి భారం కాకుడదని భావించారు..ఇంట్లో ఉన్న పురుగుల మంది ఆత్మహత్యయత్నం చేశారు..

 • Share this:
  ఓ వైపు వృద్ధాప్యం.. మరోవైపు అనారోగ్యం.. ఇద్దరు వృద్దులను ఆత్మహత్య వైపు పురిగొల్పింది...ముఖ్యంగా వృద్యాప్యంలో తన సంతానికి భారం కావటం ఇష్టంలేక.. ఆ దంపతులు(old couple) కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ ఈ వయస్సులో మరెవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఆ పండుటాకులు(old couple) చేసిన పనికి గ్రామంలో చర్చనీయాంగా మారింది.

  తమకు పుట్టిన సంతానం అంతా సెటిల్ అయ్యాక వారివద్ద ఉండి చివరి అంకాన్ని గడపాల్సిన వృద్దుల ఆలోచన సరళి మారుతోంది. మారుతున్న మానవ సంబంధాలకు అనుగుణంగా వారిలో దారుణ ఆలోచనలు చోటు చేటు చేసుకుంటున్నాయి. ఈ సంధర్భంలోనే ఓ వృద్ద జంట తన కొడుకుపై ఆధారపడి బతకడం ఇష్టం లేక ప్రాణాలు తీసుకునేందుకు సన్నద్దమయ్యారు.

  ఇది చదవండి :టీచర్ కొట్టడడంతో విద్యార్థినికి పక్షవాతం.. హోంవర్కు చేయనందుకేనంటూ తల్లి ఫిర్యాదు.. !


  వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా(warangal ) చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటు చేసుకుంది. నరిగే కొమురయ్య నరిగే ఐలమ్మలకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి కాగా.. అందరికి పెళ్లిళ్లు చేశారు. ఒక్కడే కొడుకు కావడంతో దంపతులిద్దరూ ఆయన దగ్గరే ఉంటున్నారు.రెండు నెలల క్రితం ఐలమ్మకు పక్షవాతం వచ్చింది. కొడుకు కోడలు తనకు సపర్యలు చేస్తున్నారు. మీదపడిన వయసు ఓవైపు... ముంచుకొచ్చిన అనారోగ్యం మరోవైపు.. దంపతులిద్దరినీ మంచానికే పరిమితం చేశాయి. కడుపున పుట్టిన వారికి తమ వల్ల కలుగుతున్న ఇబ్బందులను కళ్లారా చూస్తూ.. ఏమీ చేయలేక రోజూ కుమిలిపోయేవారు.

  తమకు పుట్టిన కూతుళ్లేమో.. వారివారి కుటుంబాలతో ఉన్నారు. ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. వాళ్లను రోజురోజుకూ తమ బతుకు కొడుకుకు భారం అవుతున్నట్టనిపించింది.ఇదంతా ఆలోచిస్తూ.. చివరకి విరక్తి చెందారు. ఈ బాధలన్నింటి నుంచి విముక్తి పొందాలనుకున్నారు. దంపతులిద్దరూ.. ఆత్మహత్య (suicide)చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పొలంలో వేసే విషపుగుళికలను కూల్​డ్రింక్​లో కలుపుకుని తాగేశారు.

  ఇది చదవండి : పెళ్లైన నెలకే భార్యపై అనుమానం..కట్ చేస్తే... భార్యభర్తలు విగతజీవులయ్యారు... !


  అయితే ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గ్రామస్థులు గమనించి వెంటనే సమీపంలోని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి (hospital)తరలించారు. చికిత్స పొందుతున్న ఐలమ్మ పరిస్థితి కొంత నిలకడగా ఉన్నా... కొమురయ్య ఆరోగ్యం విషమంగా మారటం వల్ల మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ విషయం తెలిసిన కొమురయ్య, ఐలమ్మ కూతుళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ తల్లిదండ్రులను చూసుకోవటం భారమేమీ కాదని.. ఇలా ఎందుకు చేశారో తెలియట్లేదన్నారు.

  అయితే సాధరణంగా ఎంతటి పరిస్థితులు ఉన్నా ఆత్మహత చేసుకునేందుకు ముందుకు రారు.. కాగా గత కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లాలో కూడా ఓ వృద్దుడు తన భార్య మంచాన పడడంతో సపర్యలు చేయలేక ఇంట్లోనే ఉరిపెట్టి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. కాగా తాజాగా ఇలాంటీ సంఘటన చేటు చేసుకోవడం సమాజంలోని వృద్దులపై సంతానం వ్యవహరిస్తున్న తీరు మారుతుండడం ఇందుకు కారణం. వృద్దాప్యంలో మంచాన పడితే వారికి సపర్యలు చేయడానికి కొడుకులు గాని, కూతుళ్లు గాని వచ్చేందుకు ఇష్టపడడం లేదు.. దీంతో ఇలా ఆత్మచేసుకోవడమే మేలని పలువురు భావిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఇలాంటీ సంఘటనలు పునారావృతం కాకుండా ఆయా కుటుంబాలు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  Published by:yveerash yveerash
  First published: