Santhosh, News 18, Warangal
ఆసియాలో రెండో అతిపెద్ద వరంగల్ వ్యవసాయ మార్కెట్లో జీరో దందాలు నియంత్రించేందుకు ఓవైపు మార్కెట్ యార్డ్ కు చెందిన ప్రత్యేక పరిశీలన బృందం విచారణ చేపడుతుండగానే, లెక్కచేయకుండా కొంతమంది వ్యాపారులు జీరో దందా కొనసాగిస్తున్నారు. ఇటీవల మార్కెట్లో నకిలీ తక్ పట్టీలతో మార్కెట్ ఆదాయానికి గండిపడుతున్న విషయంపై ఆరోపణలు రాగా.. స్పందించిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జిల్లా స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించి విచారణ జరిపించారు.
Read This : Visakhapatnam: విశాఖపట్నానికి జగన్ షిఫ్ట్..! సీఎం కొత్త నివాసం ఎక్కడంటే..?
అయితే ఇటీవల తనిఖీ బృందం మార్కెట్లో గేట్ ఎంట్రీలు, తక్ పట్టీలు, రిజిస్టర్లు, కొనుగోళ్ల తీరును పరిశీలిస్తున్న సమయంలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ జై గణేష్ ట్రేడింగ్ అర్థిదారులకు సంబంధించిన మిర్చిని భారత్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారి జీరో కాంటాలు నిర్వహిస్తూ దొరికిపోయారు. విచారణ కమిటీ అధికారి ప్రసాద్ రావు ఆదేశాల మేరకు మార్కెట్ కార్యదర్శి రాహుల్, గ్రేడ్ 2 కార్యదర్శి, సహ కార్యదర్శి, మిర్చి యార్డు సూపర్వైజర్ కు మెమోలు జారీ చేయడంతో పాటు సదరు వ్యాపారిని వారం రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read This :
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో వేల క్వింటాళ్ల మిర్చి పంటను రైతులు మార్కెట్ కు తీసుకొస్తారు. ఈ రెండు నెలల్లో మార్కెట్లో కోట్ల రూపాయల్లో జీరో దందా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో కొనుగోలు చేసిన పంట ఉత్పత్తుల ఆధారంగా వ్యాపారులు, మార్కెటింగ్ శాఖకు సెస్, వాణిజ్య పనుల శాఖకు 5% చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్ కు వస్తున్న పంట ఉత్పత్తుల మొత్తానికి పన్నుల వసూలు కావడం లేదు. సుమారు 30 నుంచి 40% పంట ఉత్పత్తులను రికార్డుల్లో చేర్పించకుండానే వ్యాపారులు బయటకు తరలిస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి.
మార్కెట్లో పంట ఉత్పత్తులను రికార్డు చేయకుండా కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై దృష్టి సారించారు. ఎలాంటి జిరో దందా జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామని, గత వారం రోజుల్లో పంట ఉత్పత్తులను జీరోలుగా కొనుగోలు చేసిన వ్యాపారిని వారం పాటు మార్కెట్లో కొనుగోలు చేయకుండా వేటు వేస్తామని, అప్రమత్తంగా లేని యార్డు అధికారులకు మెమోలు కూడా జారీ చేశామని, ఎవరైనా జీరో దందాకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాహుల్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal