హోమ్ /వార్తలు /తెలంగాణ /

NIT Warangal: రూ.500తో ఆన్ లైన్ కోర్సు.. అర్హత, దరఖాస్తు చేసుకునే వివరాలు ఇలా..

NIT Warangal: రూ.500తో ఆన్ లైన్ కోర్సు.. అర్హత, దరఖాస్తు చేసుకునే వివరాలు ఇలా..

2. వీడియో.. ఆడియోలో స్ప‌ష్ట‌త లేకపోవ‌డం వంటివి జ‌రిగాయి.. జ‌రుగుతున్నాయి. వీటికి కార‌ణం అని ఇం టర్నె ట్
సమస్య అనుకుని చాలామంది పట్టించుకోరు. కానీ అస‌లు కార‌ణం ఇంట‌ర్నెట్ కాదు  యూజర్స్ ల్యాప్‌ట్యాప్‌ వెబ్ కెమెరా, మైక్ అని గూగుల్ చెబుతోంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

2. వీడియో.. ఆడియోలో స్ప‌ష్ట‌త లేకపోవ‌డం వంటివి జ‌రిగాయి.. జ‌రుగుతున్నాయి. వీటికి కార‌ణం అని ఇం టర్నె ట్ సమస్య అనుకుని చాలామంది పట్టించుకోరు. కానీ అస‌లు కార‌ణం ఇంట‌ర్నెట్ కాదు యూజర్స్ ల్యాప్‌ట్యాప్‌ వెబ్ కెమెరా, మైక్ అని గూగుల్ చెబుతోంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

NIT Warangal: కరోనా తరువాత ఆన్‌లైన్ కోర్సులకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ప్రముఖ విద్యాసంస్థలు ఈ విధానంలోనే వివిధ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT వరంగల్) "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్(Learning) అప్లికేషన్స్" అనే ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది.

ఇంకా చదవండి ...

కరోనా తరువాత ఆన్‌లైన్ కోర్సులకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ప్రముఖ విద్యాసంస్థలు ఈ విధానంలోనే వివిధ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT Warangal) "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్(Learning) అప్లికేషన్స్" అనే ఆన్‌లైన్ కోర్సు(Online Course)ను ప్రారంభించింది.నాలుగు రోజుల ఈ ఆన్‌లైన్ కోర్సును సంస్థకు చెందిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్(Education), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(Computer Science and Engineering) విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల నిపుణులు, యూఎస్ యూనివర్సిటీల ప్రొఫెసర్‌లు ఈ కోర్సు నేర్పించనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు, నిపుణులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని NIT వరంగల్ కోరింది.

ఈ ఆన్‌లైన్ కోర్సు బోధన రంగంలో ఉన్నవారికి, రిసెర్చ్ స్కాలర్లకు, పరిశ్రమ నిపుణులకు, MCA, MBA, డిగ్రీ, లేదా పాలిటెక్నిక్ అర్హతగల విద్యార్థులకు అందుబాటులో ఉంది.

SAI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. SAIలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. వివరాలివే

మొత్తం 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కోర్సు ఫీజు రూ.500 కాగా, నిపుణులకు రూ.1000గా నిర్దేశించారు. కోర్సు పూర్తిచేసిన వారు NIT వరంగల్ అందించే ఇ-సర్టిఫికెట్ పొందవచ్చు.

కోర్సులో ఎలాంటి అంశాలు నేర్పిస్తారు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించేలా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, సూపర్‌వైజ్డ్ అండ్ అన్‌సూపర్‌వైజ్డ్ అల్గారిథం వంటి విభాగాలపై ప్రాథమిక అంశాలు నేర్పిస్తారు.

AP Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక

పైథాన్ ద్వారా డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా విజువలైజేషన్‌ పనితీరు గురించి చెబుతారు. రిగ్రెషన్ వంటి సూర్‌వైజ్డ్ లెర్నింగ్.. SVM, KNN వంటి అన్‌సూపర్‌వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, వివిధ డీప్ లెర్నింగ్ టాపిక్స్ ఈ కోర్సులో ఉంటాయి.

ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ కోర్సును 2021 అక్టోబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 24 లోపు దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ వెబ్‌సైట్‌లోని అధికారిక బ్రౌచర్‌లో అందుబాటులో ఉంచిన లింక్‌ ద్వారా వివరాలు అందించి, పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ కోర్సు ప్రారంభానికి రెండు రోజుల ముందు ఎంపికైన అభ్యర్థులకు కన్ఫర్మేషన్ ఈ-మెయిల్‌ పంపిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్ కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ పొందవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ తెలుసుకోండి.

First published:

Tags: Apply online, Learning, Warangal

ఉత్తమ కథలు