Home /News /telangana /

WARANGAL NETIZENS AND CONGRESS PARTY WERE OUTRAGED WHEN TRS PARTY FLAGS WERE HOSTED ON RAKESH FUNERAL VEHICLE IN WARANGAL PRV

Warangal: రాకేశ్​ అంతిమయాత్రలో TRS​ అలాంటి పనులు చేసిందా..? తూ.. మీ బతుకులు అంటూ నెటిజన్ల విమర్శలు

అంతిమయాత్ర వాహనంపై టీఆర్​ఎస్​ జెండాలు

అంతిమయాత్ర వాహనంపై టీఆర్​ఎస్​ జెండాలు

పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్‌కు వరంగల్​లో (Warangal) వేలాది మంది ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా టీఆర్​ఎస్​ చేసిన అత్యుత్సాహంపై కొందరు మండిపడ్డారు. కాంగ్రెస్​ అయితే రాబందులంటూ మండిపడింది.

    ఎప్పటికైనా భారత ఆర్మీ (Indian Army)లో చేరి దేశానికి సేవ చేయాల‌నేది ఆ యువ‌కుడి క‌ల‌. కేంద్రప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కీం శాశ్వ‌తంగా త‌న క‌ల‌ల‌కు స‌మాధి క‌డుతుంద‌ని ఆందోళ‌న చెందాడు యువ‌కుడు. కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేక ఉద్య‌మంలో భాగ‌స్వామి కావాల‌ని హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఉద్య‌మిస్తున్న యువ‌కుడిపై పోలీసుల తూటా పేలింది. దీంతో అత‌ని క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయి.  సైనిక నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్‌ స్కీంకు (Agnipath Scheme) వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఆందోళనలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు దామెర రాకేశ్ (Rakesh). రాకేశ్‌కు వరంగల్​లో (Warangal) వేలాది మంది ప్రజలు,రాజకీయ నాయకులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం 10.30 గంటలకు వరంగల్​ ఎంజీఎం (MGM) మార్చురీ నుంచి రాకేశ్‌ అంతిమయాత్ర (Funeral) ప్రారంభం కాగా, నగర ప్రధాన రహదారుల మీదుగా వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట వరకు ఉత్కంఠగా.. ఉద్విగ్నభరితంగా సాగింది. ఉదయం 8గంటలకే ఎంజీఎం మార్చురీ ప్రాంతం వేలాది మందితో నిండిపోయింది. ఇక్కడ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాకేశ్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    అంతిమ యాత్ర వాహనానికి టీఆర్ఎస్ జెండాలు..

    ఇదే సమయంలో అంతిమయాత్రలో (Funeral) టీఆర్​ఎస్​ దూకుడుపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అంతిమయాత్ర వాహనానికి పలువురు అత్యుత్సాహంతో టీఆర్​ఎస్​ జెండాలు కట్టారు. అయితే అంతిమ యాత్ర వాహనానికి టీఆర్ఎస్ జెండాలు (TRS Flags) ఉండటాన్ని పలువురు ఆర్మీ ఉద్యోగార్థులు, రాకేష్ మిత్రులు వ్యతిరేకించారు. జాతీయ జెండాలు మాత్రమే ఉండాలని తెరాస జెండాలు తొలగించాలని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనను పలువురు సోషల్​మీడియాలో పెట్టడంతో టీఆర్​ఎస్​ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ నెటిజన్లు (Netizens) మండిపడ్డారు.



    ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)​ సైతం విమర్శలు చేసింది. ‘‘ ఆ వీరుడి అంతిమ యాత్రలో ఉండాల్సింది, భారత త్రివర్ణ పతాకం రా రాబందులారా! మీ ఫ్యాసిస్టు పింకు జండాలు కాదు! రాబందులు శవాల మీద వాలి పీక్కు తినడం తెరాస నాయకులను చూసే నేర్చుకున్నాయేమో అని అనిపిస్తుంది’’. అని ట్విటర్​లో మండిపడింది. ఓ నెటిజన్​ అయితే తూ.. మీ బతుకులు అంటూ మండిపడ్డాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agnipath Protest, Army, Trs, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు