హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: చరిత్ర కలిగిన శిల్పకళా సంపద.. అభివృద్ధికి నోచుకోని ఖిల్లా వరంగల్

Warangal: చరిత్ర కలిగిన శిల్పకళా సంపద.. అభివృద్ధికి నోచుకోని ఖిల్లా వరంగల్

X
శిథిలమవుతున్న

శిథిలమవుతున్న శిల్పకళ సంపద

Telangana: వరంగల్ మ్యూజియం బిల్డింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సుమారు 14 సంవత్సరాల గడుస్తున్నా ఇప్పటికి పనులు పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Santhosh, News 18, Warangal

వరంగల్ మ్యూజియం బిల్డింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సుమారు 14 సంవత్సరాల గడుస్తున్నా ఇప్పటికి పనులు పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నిర్లక్ష్యానికి గురవుతున్న మ్యూజియం బిల్డింగ్ పై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ..

వరంగల్ శివారు ప్రాంతమైన కిలా వరంగల్ లో నిర్మిస్తున్న మ్యూజియం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులకు ప్రతిపాదన చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికల సమయం రావడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే వదిలేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో అప్పటి గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందురల్ ఆధ్వర్యంలోమరలా శంకుస్థాపన చేశారు. బిల్డింగ్ నిర్మాణాలు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసారు. అధికారులు రెండేళ్ల నుంచి పనులు జరగకపోయినా పట్టించుకునే నాథుడే లేకపోయారు.

కాకతీయుల కాలం నాటి శిల్ప సంపద బిల్డింగులు షెడ్లు లేకపోవడంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాయి. కొన్ని శిల్పాలు విరిగిపోవడంతో అక్కడకు వచ్చిన పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. శిధిలమైపోతున్న శిల్ప సంపదలను కాపాడాలని కళాకారులు, చరిత్రకారులు కోరడంతో కొత్త బిల్డింగు నిర్మాణానికి పురావస్తు పర్యాటక శాఖ నిర్మాణం చేపట్టింది.

ఎంతో చరిత్ర కలిగిన కాకతీయులు పరిపాలించినటువంటి గడ్డ, గొప్పగా పరిపాలించిన శిల్పకళా సంపద ఎవరు చూడలేని ఒక దయానియా స్థితిలో ఉంది. 2015వ సంవత్సరంలో సుమారు కోట్ల రూపాయలతో వ్యయంతో బిల్డింగ్ నిర్మాణం చేపట్టింది. అధికారుల నిర్లక్ష్యంతో బిల్డింగ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిర్మాణం పూర్తి కాకపోవడంతో మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. పర్యటకులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెబుతున్నారు.ఇక్కడికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులు బిల్డింగ్ పరిస్థితిని చూసి నిరాశ చెందుతున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఈ సారించి బిల్డింగ్ పనులు పూర్తిచేయాలని వరంగల్ తూర్పు బిజెపి నాయకుడు కందిమల్ల మహేష్ డిమాండ్ చేశారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు