హోమ్ /వార్తలు /తెలంగాణ /

డెడ్ బాడీలు మార్పు ...కంగుతిన్న కుటుంబీకులు..

డెడ్ బాడీలు మార్పు ...కంగుతిన్న కుటుంబీకులు..

ఆందోళనలో బాధిత కుటుంబం

ఆందోళనలో బాధిత కుటుంబం

Telangana: ఎంజీఎం మార్చురీలో దారుణం జరిగింది. ఒకరి మృతదేహం బదులు వేరే మృతదేహాన్ని ఇచ్చిన పోస్ట్ మార్టం చేశారుసిబ్బంది,  కొద్ది దూరం వెళ్ళాక కంగు తిన్న బంధువులు మళ్లీ ఎంజీఎం కి వచ్చి తన బంధువు మృతదేహం తీసుకెళ్లారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఎంజీఎం మార్చురీలో దారుణం జరిగింది. ఒకరి మృతదేహం బదులు వేరే మృతదేహాన్ని ఇచ్చిన పోస్ట్ మార్టం చేశారుసిబ్బంది,  కొద్ది దూరం వెళ్ళాక కంగు తిన్న బంధువులు మళ్లీ ఎంజీఎం కి వచ్చి తన బంధువు మృతదేహం తీసుకెళ్లారు. వరంగల్ నగరంలోని కాకతీయ వైద్య కళాశాలకు సంబంధించిన మార్చరీలో స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లకి చెందిన రాగుల రమేష్ భార్యతో గొడవపడి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరో వ్యక్తి భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పరమేశ్వర్ గాయంతో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారమే మృతి చెందాడు.పంచనామా అనంతరం పోస్టుమార్టం చేసిన సిబ్బంది పరమేశ్వర్ మృతదేహానికి బదులు రమేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు... కొద్ది దూరం వెళ్ళాక మృతదేహాన్ని చూడడంతో తమకు సంబంధించిన మృతదేహం కాదని తిరిగి ఎంజీఎం మార్చురీకి వచ్చి పరమేశ్వర్ మృతదేహాన్ని తీసుకెళ్లారు.

దీంతో కొద్దిసేపు రమేష్ బంధువులు ఎంజీఎం వద్ద ఆందోళన చేశారు. ఇక పోస్టుమార్టం సిబ్బంది తమకు సంబంధం లేదని వారే మద్యం మత్తులో ఒక మృతదేహానికి బదులు ఇంకో మృతదేహాన్ని తీసుకెళ్లారని తప్పు తమది కాదని మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానంచెబుతున్నారు.

ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారుకాందారిపల్లి వాసి రాగుల రమేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేష్ మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీ అధికారులు ఇచ్చిన్నట్లు మృతుడి బంధువులు వాపోతున్నారు. అంత్యక్రియలు చేస్తుండగా గమనించిన బంధువులు ఆందోళనకు దిగారు.ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు