Santosh, News18, Warangal
వరంగల్ (Warangal) అంటేనే కాకతీయ వైభవానికి (Kakatiya Dynesty) పెట్టింది పేరు. ఆనాటి నిర్మాణాలు, ఆలయాలు ఇప్పటికీ మనల్ని అబ్బుర పరుస్తూనే ఉంటాయి. కొన్ని నిర్మాణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. వాటిలోని రహస్యాలు ఇప్పటికీ బయటపడలేదు. అయితే వరంగల్ కేంద్రంలో కాకతీయులు నిర్మించిన ఒక చారిత్రాత్మక రహస్య బావి ఉంటుంది. మూడు అంతస్తులు కలిగిన ఈ బావికి మరొక పేరు కూడా ఉంది. దానిని బహుళ అంతస్తులు బావి అని కూడా అంటారు. మొదటి అంతస్తులో స్నానం ఆచరించేందుకు రెండవ అంతస్తులు దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మించారు. మూడవ అంతస్తులో పూజ మందిరాలు ఉంటాయి. ప్రతి అంతస్తుని 42 స్తంభాలతో నిర్మించారు.
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రుద్రమదేవిని రుద్రదేవుడిగా గణపతి దేవుడు పరిచయం చేస్తాడు. రుద్రమదేవి ఏకాంతంగా కాలక్షేపం చేయడానికి ఏ ప్రదేశంలో గడపలేక ఈ బహుళ అంతస్తుల భావిని నిర్మించారు. అయితే ఈ బావికి రెండు రహస్య మార్గాలు కూడా పూర్వీకులు అంటుంటారు. ఒక మార్గం కిలో వరంగల్ నుండి ఈ బహుళ దుస్తుల బావి దగ్గరికి మరొకటి ఈ బావి నుండి హనుమకొండలోని వేయి స్తంభాల గుడి వరకు ఉంటుంది.
రాణి రుద్రమదేవి కిల వరంగల్ నుండి రహస్య మార్గం ద్వారా ఈ బావి వద్దకు చేరుకొని స్నానం ఆచరించే వారని తెలుస్తోంది. ఆ తర్వాత వేయి స్తంభాల గుడిలో పూజ నిర్వహించే వారిని చరిత్రకారులు చెప్పుకుంటారు. ఈ బహుళ అంతస్తులు బావి కేవలం ఏడాది వ్యవధిలోనే నిర్మించారు. ఇంతటి అద్భుతమైన ప్రదేశంలో వరంగల్లోని కొంతమంది ఆకతాయిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు నిలయంగా మారింది.
ఈ విషయాన్ని గుర్తించిన పురావస్తు శాఖ ప్రభుత్వానికి తెలియజేయగా 2017- 2018 సంవత్సరంలో ఈ బహుళ అంతస్తుల బావిని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లింది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్నాయి. బహుళ అంతస్తుల బావి చూడటానికి వచ్చే పర్యటకుల కోసం పలు సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంతటి చారిత్రక కలిగిన ఈ బహుళ అంతస్తుల భావిని తిలకించడానికి ప్రతి ఒక్కరూ రావాలని వరంగల్ కి చెందిన గజ్జల లింగమూర్తి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal