Home /News /telangana /

WARANGAL MOTHER CARRIES HER 15YEAR OLD SON IN HER ARMS AND TAKES HIM THREE KILOMETERS TO SCHOOL IN HANMAKONDA DISTRICT SNR

Telangana : కొడుకును రోజు మూడు కిలోమీటర్లు మోసుకెళ్లి టెన్త్ క్లాస్ చదివిస్తున్న తల్లి .. మాతృదేవోభవ

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Great Mother: ఏ తల్లైనా బిడ్డను నవమాసాలు మాత్రమే మోస్తుంది. కాని ఆ మాతృమూర్తి తన కొడుకుకి15ఏళ్ల వయసు వచ్చినప్పటికి తన అర చేతుల్లో పెట్టుకొని మోస్తోంది. భగవంతుడు పెట్టిన లోపాన్ని లెక్కచేయకుండా పేదరికాన్ని మర్చిపోయి కొడుకును ప్రయోజకుడిగా మార్చేందుకు అతని కోసం తన చెమటను ధారబోస్తోంది.

ఇంకా చదవండి ...
ఏ తల్లైనా బిడ్డను నవమాసాలు మాత్రమే మోస్తుంది. కాని ఆ మాతృమూర్తి తన కొడుకుకి15ఏళ్ల(15years) వయసు వచ్చినప్పటికి తన అర చేతుల్లో పెట్టుకొని మోస్తోంది. భగవంతుడు పెట్టిన లోపాన్ని లెక్కచేయకుండా పేదరికాన్ని మర్చిపోయి కొడుకును ప్రయోజకుడిగా మార్చేందుకు అతని కోసం తన చెమటను ధారబోస్తోంది. ఏ తల్లి చేయలేని కఠోర శ్రమను ఆమె మాత్రమే భరిస్తూ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. హన్మకొండ(Hanmakonda)జిల్లాలో ఓ పేదింట్లో పుట్టిన చదువుల బిడ్డ దయనీయగాధ అందర్ని కట్టిపడేస్తోంది.

Hyderabad | Crime : TRS ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై ఎటాక్ .. కారులోనే నరకం చూపించిన దుండగులుస్కూల్‌కి బిడ్డను మోసుకెళ్తున్న తల్లి..
జన్మనిచ్చిన తల్లిదండ్రులను పితృదేవతలు అని సంభోదిస్తారు. అది నూటికి నూరు శాతం నిజమని నిరూపించింది ఓ మాతృమూర్తి. హన్మకొండ జిల్లా భీమదేవరకొండపల్లి మండలం రంగయ్యపల్లిలో నివసిస్తున్న ఓ పేద కుటుంబంలో చదువుల బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరే రాకేష్. రాకేష్ ప్రస్తుతం వంగర హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. పేదరికంతో పాటు రాకేష్‌కి అవయవలోపం కూడా ఓ శాపంగా మారింది. రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో నడవలేని స్థితిలో ఉన్నాడు. రాకేష్ పదవ తరగతి చదవడానికి రంగయ్యపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర హైస్కూల్‌కి వెళ్లాలి. చదువుకోవాలన్న బిడ్డలోని తపనను చూసి తల్లి అతని పాలిట యంత్రంగా మారింది. రోజు రాకేష్‌ని తన రెండు చేతుల్లో పసివాడ్ని మోసినట్లుగా మూడు కిలోమీటర్లు మోసుకెళ్లి స్కూల్‌ క్లాసులో కూర్చోబెట్టడం..స్కూల్‌ వదిలిపెట్టగానే బిడ్డను ఎత్తుకొని తిరిగి ఇంటికి తీసుకువస్తోంది.అమ్మను మించి దైవమున్నాదా..
రాకేష్ కోసం ఏ తల్లి చేయలేని సాహసం ఆమె చేస్తోంది. మంచి ఆసుపత్రిలో చూపించి బిడ్డకు వైద్యం చేయించే ఆర్ధిక స్తోమత లేదు. కనీసం బిడ్డను ఆటోలో స్కూల్‌కి పంపించలేని పేదరికంలో మగ్గిపోతున్నారు రాకేష్‌ తల్లిదండ్రులు. అయితే చదువు పట్ల తన కొడుకుకి ఉన్న ఆసక్తిని చూసి అతడ్ని గొప్ప ప్రయోజకుడ్ని చేయాలని ఆ తల్లి సంకల్పించింది. అందుకే ఎదిగిన కొడుకు పసివాడిగా భావిస్తూ ..కుటుంబ భారంతో పాటు బిడ్డ బరువును మోస్తూ అతడ్ని చదివిస్తోంది.

Naga Panchami : అక్కడ పాముకు పోసిన తర్వాత మిగిలిన పాలతో అన్న, తమ్ముళ్ల కళ్లు కడుగుతారు .. ఎందుకంటే ..?


మీ సాయం ఊరికే పోదు..
ఎక్కడో బీహార్ , వెస్ట్ బెంగాల్‌లో రెండు కాళ్లు ఉండి పేదరికం కారణంగా ఫీజులు కట్టుకోలేని వాళ్ల బాధను సోషల్ మీడియా ద్వారా చూసి కొందరు సాయం చేయడం చూశాం. ఒంటరి కాలుతో స్కూల్‌కి వెళ్లే బాలికను చూసి చలించి సాయం చేస్తామని ప్రకటించారు సినీ నటుడు సోనుసూద్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ఎక్కడో ఉన్న వారికి సాయం చేసినట్లుగానే తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో రెండు కాళ్లు లేకపోయినా పదవ తరగతి చదవటానికి తల్లి చేతులతో మోసుకెళ్తున్న బాధను అర్ధం చేసుకోవాలి. దివ్యాంగుడైన నిరుపేద విద్యార్ధి ట్రీట్‌మెంట్ కోసం పెద్దమనసు చేసుకొని అపన్నహస్తం అందించాలని కోరుతున్నారు.

పెద్ద మనసు చాటుకోండి..
రాకేష్‌కి ట్రీట్‌మెంట్ ఇప్పించేందుకు సుమారు ఐదు లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలిపారు. అయితే అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో తల్లిదండ్రులు దివ్యాంగుడైన బిడ్డను మోస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. రాకేష్ చదువుతున్న స్కూల్ టీచర్లు సైతం ఇలాంటి క్లవర్ స్టూడెంట్‌కి సాయం చేయడానికి దాతలు ముందుకొచ్చి ట్రీట్‌మెంట్ చేయించాలని కోరుతున్నారు. మరి ఈ దివ్యాంగుడైన నిరుపేద విద్యార్ది సమస్యపై ఎవరు సాయం చేస్తారో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Telangana News, Warangal

తదుపరి వార్తలు