Mulugu:ఖాకీ యూనిఫామ్ వేసుకున్న పోలీసులంతా ఒకటేనని భావించవద్దు. చాలా మంది సెక్యురిటీతో పాటు పబ్లిక్ సర్వీస్ చేస్తుంటారు. ములుగు జిల్లా మంగపేట ఎస్ఐ కూడా ఓవైపు డ్యూటీ చేస్తూనే మానవతధృక్పధాన్ని చాటుకున్నారు. ఆయన చేసిన సేవను చూసి జిల్లా మంత్రే స్వయంగా సన్మానించారు.
పోలీసులంటే పవర్ఫుల్ ఆఫీసర్స్ మాత్రమే కాదని..పబ్లిక్ సర్వెంట్స్ అని నిరూపించారు ఓ సబ్ ఇన్స్పెక్టర్. ములుగు(Mulugu) జిల్లా మంగపేట(Mangapeta) మండలంలోని శనిగకుంట గ్రామంలో అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod),ములుగు జిల్లా కలెక్టర్Collector కృష్ణ ఆదిత్యKrishna Aditya శనిగకుంట గ్రామానికి వచ్చారు. పాతిక ఇళ్లు పూర్తిగా కాలిపోయి నిరాశ్రయులైన వారికి మేమున్నామనే భరోసా ఇచ్చారు మంత్రి..మంత్రి వచ్చిన సందర్భంగా సెక్యురిటీలో భాగంగా స్థానిక మంగపేట ఎస్ఐ(SI) తాహెర్‌బాబా(Taher Baba) డ్యూటీలో ఉన్నారు. మంత్రి బాధితుల్ని పరామర్శిస్తున్న సమయంలో మేష లక్ష్మి (Mesha Lakshmi)అనే వృద్ధురాలు వడదెబ్బ(Sunstroke)తగిలి సొమ్మసిల్లి పడిపడిపోయింది. వృద్ధురాలు అపస్మారకస్థితిలో చేరుకోవడంతో అక్కడే డ్యూటీలో ఉన్న మంగపేట ఎస్ఐ తాహెర్‌బాబా వృద్ధురాలిని అమాంతం తన రెండు చేతుల్లో ఎత్తుకొని అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిభిరం(Medical camp)దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ చాలా మంది నాయకులు, స్థానికులు వృద్ధురాలి బంధువులు ఉన్నప్పటికి ఎస్ఐ వెంటనే స్పందించడం ఓ వృద్ధురాలి ప్రాణాలు కాపాడాలన్న ఆతృతతో ఆమెను తీసుకొని పరుగులు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. జీప్(Jeep)లో కూర్చొని కానిస్టేబుళ్లను మోసుకెళ్లమని ఆదేశించే స్థాయి ఉద్యోగి, పక్కనే మంత్రి ఉన్నారు..ఆమె సెక్యురిటీ చూడాలని అనే వంకతో తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికి మంగపేట ఎస్ఐ తాహెర్ బాబా చూపించిన చొరవను చూసి అందరు ఆయన్ని ప్రశంసించారు.
పోలీస్ కాదు పబ్లిక్ సర్వెంట్..
అసలే అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు. గూడు చెదిరి రోడ్డున పడిన వాళ్లకు మంత్రి తానే స్వయంగా వచ్చి బాధితులకు ఇంట్లో వాడుకునే వస్తువులు అందజేయడానికి వచ్చారు. ఈ సందర్భంలోనే మేష లక్ష్మి అనే వృద్ధురాలు వడదెబ్బ తగిలి అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో ఎస్ఐ ఆమెను వెంటనే కారులో ఎక్కించి ఆసుపత్రికి పంపారు. ఆమె అనారోగ్యానికి గురవడంతో ఆమెకు ఇచ్చిన పరుపు, ఇతర సామాన్లను డ్యూటీలో ఉన్న మాదాసు అనీల్‌కుమార్ అనే మరో కానిస్టేబుల్ అక్కడున్న యువకుడి సాయంతో వాటిని స్వయంగా ఇంటి వరకు మోసుకెళ్లి అప్పగించారు.
(సూపర్ పోలీస్)
సేవకు తగిన గుర్తింపు..
అగ్నిప్రమాదం రూపంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులు పోలీసులు చేసిన సాయానికి హర్షం వ్యక్తం చేశారు మంత్రి. శనిగకుంట గ్రామానికి చెందిన ఆదివాసీలకు స్థానికులు, ప్రజాప్రతినిధులు, చివరకు పోలీసులు సైతం దగ్గరుండి సేవలందించడంపై మంత్రి సైతం హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడ మంగపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఐ చూపించిన చొరవను మంత్రి అభినందించారు. ఏ ఒక్కరికి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రాత్రి, పగలు వారికి అండగా ఉన్నారని మంగపేట ఎస్ఐ తాహెర్ బాబాను మంత్రి సత్యవతి రాథోడ్ సన్మానించారు. ఈకార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఎస్ఐని ప్రశంసలతో ముంచెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.