WARANGAL METRO WILL BE RUNNING IN WARANGAL VERY SOON SAYS OFFICIALS VB
Metro Rail: తెలంగాణలోని మరో నగరంలో మెట్రో పరుగులు.. ప్రయత్నాలు ముమ్మరం చేసిన అధికారులు..
Metro Rail: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో నగరంలో మెట్రో పరుగులకు అడుగులు పడుతున్నాయి. త్వరలోనే వరంగల్ మహాననగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
Metro Rail: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో నగరంలో మెట్రో పరుగులకు అడుగులు పడుతున్నాయి. త్వరలోనే వరంగల్ మహాననగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో పెద్ద నగరం వరంగల్. తర్వరలోనే ఈ మహానగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. వరంగల్ లోని కాజీపేట నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకూ భూ, ఆకాశ మార్గంలో ఈ నియో మెట్రో రైలు ప్రయాణించనుంది. అందుకు తగ్గట్లుగా 15 కిలో మీటర్లు... 21 స్టేషన్లతో మహారాష్ట్రలోని నాసిక్నియో మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో మహామెట్రో సంస్థ రూపొందించిన డీపీఆర్, కేంద్ర సర్కార్ దగ్గరకు చేరుకుంది. ఈ మెట్రో రైలు ఏడు కిలోమీటర్ల మేర భూమార్గంలోను, మరో ఎనిమిది కిలోమీటర్ల మేర ఆకాశమార్గంలోనూ నడుస్తుంది. నియో మెట్రో వరంగల్ ప్రాజెక్టుకు 1,012 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సాధారణ విధానంలో అయితే కిలోమీటరు నిర్మాణానికి.180 కోట్ల ఖర్చు అవుతుండగా.. తాజా డీపీఆర్ ప్ర్రకారం కిలోమీటర్ కు 60 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఒకప్పుడు వరంగల్ లో 200 లోకల్ బస్సులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గింది.
దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించాలని చాలా రోజుల నుంచి జనం కోరుతున్నారు. గత ఏడాదిగా మెట్రో రైల్ ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఇదే సమయంలో ఈ కొత్త నియో మెట్రో విధానానికి వరంగల్ రోడ్లు సరిపోతాయని కూడా మెట్రో సంస్థ పేర్కొంది. నియో మెట్రో సాంకేతికతలో ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తారని , రబ్బరు టైర్లపై నడవడం దీని ప్రత్యేకత అని మహా మెట్రో వెల్లడించింది. ఆటోమేటిక్ టికెటింగ్ విధానంతో నిర్వహణ ఖర్చు కూడా బాగా తగ్గుతుందని పేర్కొంది. సాధారణ విధానంలో మెట్రో నిర్వహణకు కిలోమీటర్ కు 35 మంది అవసరమైతే, కొత్త విధానంలో 15మంది సరిపోతారని వెల్లడించింది. 2041 నాటికి వరంగల్ జనాభాకు తగ్గట్టుగా ఉండేలా ఈ నియో మెట్రో ప్రాజెక్ట్ ప్రణాళికను రూపొందించారు.
వరంగల్ లోని కాజీపేట రైల్వేస్టేషన్నుంచి పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్మీదుగా వవరంగల్ రైల్వే స్టేషన్ వరకు, అక్కడి నుంచి చౌరస్తా, జేపీఎన్రోడ్డు మీదుగా పోచమ్మ మైదానం వరకు ప్రధాన రహదారిని మెట్రో రైల్ ప్రతిపాదనల్లో తీసుకున్నారు. మెట్రో ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో పాటు పరిశ్రమల అభివృద్దికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రైలు, రోడ్డు మార్గాలు ఉన్న వరంగల్ కు మామునూరు ఎయిర్ పోర్ట్, మెట్రో అందుబాటులోకి వస్తే పారిశ్రామికంగా, టూరిజం పరంగా డెవలప్ జరుగుతుందని అంటున్నారు. మొదటి దశలో కాజీపేట నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకూ... రెండో దశలో మడికొండ నుంచి ఖమ్మం హైవే మామునూరు, కరీంనగర్ వైపు . నర్సంపేట మార్గంలో ధర్మారం వరకూ మెట్రో విస్తరించాలని ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాజెక్ట్ వేగం పెరగడంతో స్థానకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.