ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన సమ్మక్క-సారలమ్మ (Sammakka Saralamma) మేడారం మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగి మహా జాతరకు ముందు చిన్న జాతర జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో నేడు సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamma) మినీ జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. మొత్తం 4 రోజుల పాటు ఈ చిన్న జాతర జరగనుంది. 2023 ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఈ జాతర జరగనుంది. అయితే ఈ మినీ జాతరలో అమ్మవార్లను మాత్రం గద్దెలపైకి తీసుకురారు. ఇక మినీ జాతరకు సంబంధించి ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ఆయా తేదీల్లో చేసే కార్యక్రమాలు..
2023 ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహణ
2వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్దె శుద్ధి
3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి
ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధిక మంది హాజరయ్యే పండుగ మేడారం. ఈ గిరిజన జాతరకు సుమారు 10 కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ఈ జాతరకు తెలంగాణ (Telangana) రాష్ట్రం నుండి కాక పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
ఆంధ్రప్రదేశ్ (Ap), తెలంగాణ (Telangana), మధ్యప్రదేశ్ (Madhyapradesh), ఒడిశా (Odisha), ఛత్తీస్ ఘడ్ (Chattesghad), ఝార్ఖండ్ (jharkhand) నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medaram, Medaram jatara, Telangana, Warangal