ఉదయం ఎస్పీ నుంచి రివార్డు.. మధ్యాహ్నం సస్పెన్షన్‌.. రాత్రికి అరెస్టు.. అడవిలో మహిళా ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసులో..

శ్రీనివాస్ రెడ్డి (ఫైల్)

Sexual Harassment: ట్రైనీ ఎస్సైని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషీ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా) 

  కొన్నిసార్లు ఎవరెంత పనిమంతులైనా.. ఎంత పెద్ద అధికారుల వద్ద ప్రశంసలు పొందినా.. ప్రవర్తన బాగోకపోతే.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయనడానికి ఇది ఉదాహరణ. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ ఎస్సైగా పనిచేస్తున్న పి.శ్రీనివాసరెడ్డికి శాఖాపరంగా మంచి సమర్ధుడన్న పేరుంది. సోమవారం రాత్రి మరిపెడ ప్రాంతంలో చిత్తూరు జిల్లా నుంచి అక్రమంగా తరలి వచ్చిన లక్షల విలువైన నల్లబెల్లాన్ని పట్టుకున్నాడు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాడు. జిల్లా ఎస్పీ నుంచి మంగళవారం ఉదయం రివార్డు సైతం పొందాడు. సోమవారం రాత్రి నల్లబెల్లం పట్టుకునే క్రమంలోనే తన ప్రవేటు వాహనంలో తన వద్ద శిక్షణ కోసం వచ్చిన ట్రైనీ ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. ఆమెపై అత్యాచారయత్నం చేయడం.. ఆమె శరీరభాగాలను తాకడం లాంటి వికృత చేష్టలు చేశాడు. దీంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో సీపీ నుంచి నార్త్‌జోన్‌ ఐజీకి నివేదిక వెళ్లడం.. ఆ వెనువెంటనే సస్పెన్షన్‌ వేటు పడడం జరిగిపోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరిపెడ ఎస్సై శ్రీనివాసరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాత్రికి రాత్రే అరెస్టు చేసి.. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

  మహబూబాబాద్ జిల్లా మరిపెడ ట్రెయినీ ఎస్సైపై అత్యాచార‌య‌త్నం చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డిపై వేటు ప‌డింది. ఐజీ నాగిరెడ్డి ఆదేశాల‌తో శ్రీనివాస‌రెడ్డిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మంగ‌ళవారం రాత్రి ప్ర‌క‌టించారు. ఐజీ నాగిరెడ్డి పేరిట‌ జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో నిందితుడిపై బాధితురాలు చేసిన ఫిర్యాదును ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఆ వివ‌రాల ప్ర‌కారం... ట్రెయినీ ఎస్సైగా విధులు నిర్వ‌హిస్తున్న మ‌హిళా అధికారికి గ‌త కొన్నాళ్లుగా ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డి మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడు. పంపిన మెసేజ్‌ల‌ను డిలీట్ చేస్తున్నాడు. అయితే ఇదే క్ర‌మంలో సోమ‌వారం రాత్రి 11:30ల స‌మ‌యంలో పోలీస్ స్టేష‌న్ నుంచి ట్రెయినీ అధికారికి ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డి కాల్ చేశాడు. బెల్లం అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంద‌ని, ఆక‌స్మిక త‌నిఖీలు చేయాల్సి ఉంద‌ని చెప్పి స్టేష‌న్‌కు రావాల్సిందిగా ఆదేశించాడు. పోలీస్ వాహ‌నంలో కాకుండా సొంత వాహ‌నంలో మ‌హిళా అధికారిని వెంట‌ తీసుకుని ఓ నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. వాహ‌నంలోనే అత్యాచారయ‌త్నం చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేర‌కు బాధితురాలు మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్‌జోషిగా ఫిర్యాదు చేసింది. ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో ప్రాథ‌మిక ఆధారాల‌ను ప‌రిశీలించిన ఐజీ నాగిరెడ్డి ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అదే స‌మ‌యంలో శ్రీనివాస‌రెడ్డిపై మ‌రిపెడ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి విచార‌ణ బాధ్య‌త‌ల‌ను తొర్రూరు డీఎస్పీ వెంక‌ట‌ర‌మ‌ణ‌కు అప్ప‌గించారు. డిపార్ట్‌మెంట్‌లో జ‌రిగిన అనుహ్య సంఘ‌ట‌న‌తో పోలీస్‌శాఖ ఉన్న‌తాధికారులు షాక్‌కు గుర‌య్యారు. సున్నిత‌మైన అంశం కావ‌డంతో ఆచితూచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

  పొద్దున ప్ర‌శంస‌లు... సాయంత్రం స‌స్పెన్ష‌న్‌...
  విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ చూపినందుకు గాను ఉద‌యం ఎస్పీ కోటిరెడ్డి చేత ప్ర‌శంస‌లు అందుకున్న ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డి.. సాయంత్రం అదే ఎస్పీ చేత స‌స్పెన్ష‌న్ ఆర్డ‌ర్ పొంద‌డం గ‌మ‌నార్హం. మరిపెడ స్టేష‌న్ ప‌రిధిలో బెల్లం ప‌ట్టివేత‌లో ప్ర‌తిభ చూపినందుకు గాను మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌హ‌బూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో జ‌రిగిన విలేకరుల స‌మావేశంలో ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డికి ఎస్పీ కోటిరెడ్డి రివార్డు అంద‌జేశారు. ట్రెయినీ ఎస్సైపై అత్యాచార‌య‌త్నం ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సాయంత్రం స‌స్పెన్ష‌న్‌కు గురయ్యారు. రాత్రికి జైలు పాలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
  Published by:Veera Babu
  First published: