హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రేమ పేరుతో తీసుకెళ్లి దారుణం.. వాడి పాపం పండింది..!

ప్రేమ పేరుతో తీసుకెళ్లి దారుణం.. వాడి పాపం పండింది..!

అత్యాచార నిందితుడికి జైలు శిక్ష

అత్యాచార నిందితుడికి జైలు శిక్ష

ప్రేమించానంటూ ఓ ఆగంతకుడు వెంటపడితే నిజమే కావచ్చని నమ్మి వెంటవెళ్లిన పాపానికి అత్యాచారం చేసి చావుకు కారణమయ్యాడు. అంతేకాదు ఇంటిముందే మృతుదేహాన్ని పడవేసిపోయాడు పాపాత్ముడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

ప్రేమించానంటూ ఓ ఆగంతకుడు వెంటపడితే నిజమే కావచ్చని నమ్మి వెంటవెళ్లిన పాపానికి అత్యాచారం చేసి చావుకు కారణమయ్యాడు. అంతేకాదు ఇంటిముందే మృతుదేహాన్ని పడవేసిపోయాడు పాపాత్ముడు. ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయగా అధిక రక్తస్రావమై మృతి చెందిన యువతి శవాన్ని ఆమె ఇంటి సమీపంలో నడిరోడ్డుపై పడేసి పారిపోయిన ఘటనలో జనగామ జిల్లా (Janagama District) స్టేషన్ ఘన్పూర్ మండలం నవీన్ కొండ గ్రామానికి చెందిన నేరస్థుడు సాయికుమార్ కు జీవిత ఖైదు జైలు శిక్ష, నాలుగు లక్షల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

హనుమకొండ దయానందనగర్ లో అద్దెకుంటూ సమీపంలో కూరగాయల దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్న మల్లయ్య చిన్న కుమార్తె మానస ఇంటర్ చదువుతూ మానేసి తల్లిదండ్రులకు కూరగాయల దుకాణం వద్ద చేదోడు వాదోడుగా ఉండేది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న మాస్టర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాయికుమార్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ మానసను నమ్మించి 2019న కారులో కాజీపేట రాంపూర్ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్ళి మానసపై అత్యాచారం చేశాడు.

ఇది చదవండి: భారీ చోరీలు.. హడలెత్తించిన దొంగలు

దీంతో మానసకు తీవ్ర రక్త స్రావం కావడంతో మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని మానస ఇంటికి దగ్గరలో రోడ్డుపై పడేసి సాయికుమార్ వెళ్ళిపోయాడు. ఈ ఘటనలో మృతురాలి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సాయికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణలో నేరం రుజువు కావడంతో పలు సెక్షన్ల కింద జైలు శిక్ష విధించారు.

First published:

Tags: Local News, Warangal

ఉత్తమ కథలు