హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: జల్సాలకు బానిసై స్వయానా అన్న ఇంటికే వేసిన తమ్ముడు..!

Warangal: జల్సాలకు బానిసై స్వయానా అన్న ఇంటికే వేసిన తమ్ముడు..!

theft

theft

ఇటీవల తన అన్న కుమారుడి వివాహం జరగడంతో తన ఇంటిలో ఎక్కువ డబ్బుతో పాటు, బంగారు ఆభరణాలు అధికంగా ఉంటాయని పథకం వేసిన తమ్ముడు దొంగతనానికి పాల్పడి చివరికి పోలీసు అడ్డంగా బుక్కయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

రిపోర్టర్ : సంతోష్ కుమార్

లొకేషన్ : వరంగల్

ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఆ పదాన్ని నిజం చేశాడో వ్యక్తి. చాలా చాకచక్యంగా ఒకే కడుపున పుట్టిన స్వయాన సోదరుడి ఇంట్లో కన్నం వేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలోచోటుచేసుకుంది. స్వయాన అన్నయ్యఇంటిలోనే చోరీకి పాల్పడిన తమ్ముడిని ఇరువై నాలుగు గంటల్లోపు అరెస్ట్ చేసిన చెన్నారావుపేట పోలీసులు, నిందితుడి నుండి 75 గ్రాముల బంగారు ఆభరణాలు ఒక లక్ష 40 వేల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మండల లచ్చయ్య కుమారుడు 45 ఏళ్ల రవి రోజువారి కూలీగా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తూ, జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో నిందితుడికి అప్పులు కూడా అధికమయ్యాయి. కాగా, ఇటీవల కొద్ది రోజుల క్రితం ఇదే గ్రామంలో నిందితుడిర్ రవి సోదరుడుసుధాకర్ తన కుమారుడి వివాహ వేడుకలు నిర్వహించారు. నిందితుడుగత కొద్ది రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా కేవలం మద్యం సేవిస్తూ చెడు వ్యసనాలకు బానిసై , అప్పులు చేస్తూ కాలం గడుపుతున్నాడు.

ఈ క్రమంలోనే నిందితుడికి అప్పులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిళ్ళు మొదలు పెట్టారు. ఆ ఒత్తిళ్లతో రవి సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. ఇటీవల తన అన్న కుమారుడి వివాహం జరగడంతో తన ఇంటిలో ఎక్కువ డబ్బుతో పాటు, బంగారు ఆభరణాలు అధికంగా ఉంటాయని పథకం వేసిన తమ్ముడు దొంగతనానికి పాల్పడి చివరికి పోలీసు అడ్డంగా బుక్కయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసే క్రమంలో తమ్ముడుపై అనుమానం వచ్చి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

First published:

Tags: Local News, Warangal, WARANGAL DISTRICT

ఉత్తమ కథలు