హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: వాళ్ల వేధింపులే నా చావుకు కారణం.. ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రికి ఆడియో క్లిప్

Warangal: వాళ్ల వేధింపులే నా చావుకు కారణం.. ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రికి ఆడియో క్లిప్

(ప్రతీకాత్మక చిత్రం

(ప్రతీకాత్మక చిత్రం

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. 25 ఏళ్ల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను ఓ ఆడియో రికార్డు చేశాడు.

  వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. 25 ఏళ్ల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి భార్యతో పాటుగా, అత్తింటివారి వేధింపులే కారణమని ఓ ఆడియో రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లికి చెందిన తుత్తూరు ప్రదీప్‌కు భార్య, ఆమె కుటుంబ సభ్యులతో తరుచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పంచాయితీలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో వారి వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే వారి వేధింపులు భరించలేక.. ఆగస్టు 19న ప్రదీప్ బంధంపల్లికి చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.

  ముందుగా ప్రదీప్ తన వాయిస్‌తో ఆడియో రికార్డు చేశాడు. అందులో తన చావుకు భార్య, ఆమె బంధువులే కారణమని పేర్కొన్నాడు. ఆ ఆడియో క్లిప్‌ను తన తండ్రి నాగేశ్‌కు పంపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రదీప్‌ను హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

  చదవండి: మహిళ మెడలో బూట్లు వేసి నగ్నంగా ఊరేగించారు.. అదే కారణమా..?

  తాలిబన్లకు మద్దతుగా పోస్ట్‌లు.. 15 మంది అరెస్ట్.. అరెస్ట్ అయిన వారిలో పోలీసుతో పాటుగా..

  మహిళా పోలీసు దారుణ హత్య.. తల్లిలేని వారిగా మిగిలిన ఇద్దరు పిల్లలు.. ఆ పని చేసింది మరెవరో కాదు..

  ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడానిక అతని భార్య, అత్తింటి వారే కారణమని అతని కుటుంబ సభ్యులుఆరోపిస్తున్నారు. అయితే ప్రదీప్ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Suicide, Telangana, Warangal

  ఉత్తమ కథలు