Warangal: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురు.. 10 రోజుల గడిచిన దొరకని ఆచూకీ.. పాపం ఆ తండ్రి..

ప్రతీకాత్మక చిత్రం

బాలిక జూలై 7వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లింది. రాత్రివరకు కూడా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ఆమె కోసం గాలింపు చేపట్టారు. బంధువుల ఇళ్లకు ఫోన్ చేశారు. అయితే అక్కడికి కూడా రాలేదని తేలింది.

  • Share this:
    ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురు ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందాడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 10 రోజుల గడిచిన కూతురి ఆచూకీ దొరకపోవడంతో ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. చౌటపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతుకు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. కొడుకు ఇంటర్ చదవుతుండగా, కూతురు(15) 9వ తరగతి చదువుతోంది. అతడు వ్యవసాయం చేస్తుండగా, భార్య కుట్టుమిషన్ కుడుతూ కుటుంబానికి సాయంగా ఉంటుంది. అయితే అతడి కూతురు జూలై 7వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లింది. రాత్రివరకు కూడా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ఆమె కోసం గాలింపు చేపట్టారు. బంధువుల ఇళ్లకు ఫోన్ చేశారు. అయితే అక్కడికి కూడా రాలేదని తేలింది.

    దీంతో బాలిక తండ్రి మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు బాలిక తల్లిదండ్రుల కాల్‌డేటాను పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్‌కు చెందిన బాలుడు, ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలుడితో బాలిక మాట్లాడినట్లు గుర్తించారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలంచారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. 10 రోజులు గడుస్తున్న బాలిక ఆచూకీ లభించకపోవడంతో.. ఆమె తండ్రి తీవ్ర ఆవేదన చెందాడు.

    ఇవి చదవండి: అత్తకు బాయ్‌ఫ్రెండ్‌ను వెతుకుతున్న కోడలు.. క్రేజీ ఆఫర్.. అతడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది..

    Khammam: ఆ ఫొటోలు చూసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత.. అసలు వాటిలో ఏముంది..

    ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్‌కు సమీపంలో బాలిక తండ్రి పురుగుల మందు తాగాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. న్యాయం చేయండి అంటూ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై సీఐ విశ్వేశ్వర్.. బాలిక మిస్సింగ్ ఫిర్యాదు తమకు అందిందని, దానిపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. అయితే బాలిక తండ్రి పురుగుల మందు తాగే స్టేషన్‌కు వచ్చాడని, మాట్లాడుతన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: