Warangal: ఐదు నెలల క్రితం పెళ్లి.. అత్తారింట్లో అందరూ కలిసి అవమానించడంతో..

రవిలాల్

ఓ వ్యక్తికి ఐదు నెలల క్రితం పెళ్లి జరిగింది. అయితే అత్తారింట్లో అంతా కలిసి అతడిపై తిట్ల వర్షం కురిపించారు. అకారణంగా అవమానించారు.

  • Share this:
    ఓ వ్యక్తికి ఐదు నెలల క్రితం పెళ్లి జరిగింది. అయితే అత్తారింట్లో అంతా కలిసి అతడిపై తిట్ల వర్షం కురిపించారు. దీంతో అతడు షాకింగ్ నిర్ణయం తీసుకన్నాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నెక్కొండ మండలంలోని పెద్దకోర్పోలు గ్రామ శివారు రేకుల తండాకు చెందిన బాదావత్ రవిలాల్‌కు మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని భూపతిపేట గ్రామ పరిధిలోని చెరుకొమ్ముల తండాకు చెందిన మంజులతో గత ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భార్యభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. కుటుంబ కలహాల కారణంగా రవిలాల్‌ను అతడి భార్య మంజుల మాటలతో వేధించింది. మంజుల తల్లిదండ్రులు కూడా రవిని నానా మాటలు అంటుండేవారు.

    ఇక, ఇటీవల అత్తారింట్లో నిర్వహించిన ఓ పండుగకు భార్యతో పాటుగా రవిలాల్ కూడా వెళ్లాడు. అత్తారింట్లో ఉండగానే.. భార్య మంజుల, అత్తమామ బానోతు బిక్కిన, బుజ్జి, మేనమామ రమేశ్‌ను తిట్టారు. అకారణంగా అతనిని తిట్టి అవమానపరిచారు. దీంతో రవిలాల్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే స్వగ్రామానికి తిరిగి వచ్చిన రవిలాల్.. జూలై 15న ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు.

    ఇవి చదవండి: Andhra Pradesh: మరో మహిళతో చనువుగా ఉన్న తండ్రి.. బంధువుల ముందు హేళన.. కొడుకు ఏం చేశాడంటే..

    అత్తకు బాయ్‌ఫ్రెండ్‌ను వెతుకుతున్న కోడలు.. క్రేజీ ఆఫర్.. అతడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది..

    అత్తను చంపిన అల్లుడు.. అల్లుడిని చంపిన మామ.. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
    ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవిలాల్.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి దేవిసింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: