రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
వరంగల్ నగర ప్రజల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసిన రా వాటర్ సంపు కంపం హౌస్ నిరుపయోగంగా మారింది. ధర్మసాగర్ లో నీటి మట్టం తగ్గినప్పుడు వేసవిలో నీటి కొరత రాకుండా అత్యంత ప్రధానంగా వినియోగించే ఈ వాటర్ సేవలను నిలిపివేయడంతో సుమారు ఆరు సంవత్సరాలుగా మూలబడి ఉంది. దీంతో కోట్ల రూపాయల విలువైన యంత్రాలు పరికరాలు తుప్పు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. వీటిపై నిఘా లేకపోవడంతో చోరీకి గురవుతున్నాయి.
గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు దేశాయిపేటలో సుమారు 35 ఏళ్ల క్రితం ఈ పంప్ హౌస్ను నిర్మించారు. ధర్మసాగర్ రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గినప్పుడు ప్రజలకు తాగునీటికి ఇబ్బంది రాకుండా ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ నుండి ప్రవహించే నీటి రా వాటర్ సంపు పంప్ హౌస్ ద్వారా సేకరించి ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్లో శుద్ధికరణ చేసి ప్రజలకు సరఫరా చేసేవాళ్లు. అంతేకాకుండా ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కెనాల్ నీటిని ఇదే వాటర్ సంపహౌసింగ్ ద్వారా భద్రకాళి చెరువులో నింపడమే కాకుండా భద్రకాళి ఎస్ఎస్ ట్యాంకు సైతం నిలువ చేసేవారు. రా వాటర్ సంపౌజుకు మూడు విధులుగా కనెక్షన్ ఉండటంతో నీరు సేకరించి నిల్వ చేసేవాళ్లు. రోజుకు సుమారు 18 నుంచి 25 వేల మిలియన్ లీటర్ ఫర్ డే సేకరించే రా వాటర్ సంపుహౌస్ కు 2017లో కాకతీయ కెనాల్ నుంచి లింకు తొలగించడంతో నిరుపయోగంగా మారింది. దీంతో భద్రకాళి ఎస్ఎస్ ట్యాంకుకు సైతం నిరుపయోగంగా మారింది.
పంప్ హౌస్ నిరుపయోగంగా మారడంతో అందులో పనిచేసే సిబ్బంది సేవలు గాలికి వదిలేశారు. అటు భద్రకాళి ఎస్ఎస్ ట్యాంకులోని హెల్పర్లు ఇటు రా వాటర్ పంప్ హౌస్ హెల్పేర్లు నామమాత్రంగా కొనసాగుతున్నారు. కేవలం వారు విధులకు హాజరై ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్లో కూర్చొని వెళ్లడమే సరిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. హెల్పర్ల సేవలు మరోచోట ఎందుకు వినియోగించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.
రా వాటర్ పంప్ హౌస్ నిరుపయోగంగా మారడంతో మున్సిపల్ శాఖ పూర్తిగా విస్మరించిందని, వీటిని పరిరక్షణకు సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడంతో కోట్ల రూపాయల విలువైన పరికరాలు యంత్రాలు చోరీకి గురవుతున్నాయని యంత్రాలు తుప్పు పట్టిపడుతున్నాయని కోట్ల రూపాయల విలువైన ప్రజాధనాన్ని నష్టపడుతున్నారని సామాజిక కార్యకర్త శేషు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal