హోమ్ /వార్తలు /తెలంగాణ /

పేరుకే పెద్ద ఆలయం..! అభివృద్ధికి మాత్రం దూరం..!

పేరుకే పెద్ద ఆలయం..! అభివృద్ధికి మాత్రం దూరం..!

X
అభివృద్ధికి

అభివృద్ధికి నోచుకోని వరంగల్ భద్రకాళి ఆలయం

దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఓరుగల్లు నగరం (Warangal) కూడా ఒకటి. ఇక్కడ విశిష్టత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నా కానీ అవి అభివృద్ధికి నోచుకోవడం లేదు. వరంగల్ నగరం అభివృద్ధి దశల్లో అంచలంచలుగా ముందుకు సాగుతున్న క్రమంలో ఇక్కడ ఉన్న భద్రకాళి దేవాలయానికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఓరుగల్లు నగరం (Warangal) కూడా ఒకటి. ఇక్కడ విశిష్టత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నా కానీ అవి అభివృద్ధికి నోచుకోవడం లేదు. వరంగల్ నగరం అభివృద్ధి దశల్లో అంచలంచలుగా ముందుకు సాగుతున్న క్రమంలో ఇక్కడ ఉన్న భద్రకాళి దేవాలయానికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. నగరంలో ఉన్నటువంటి భద్రకాళి దేవాలయాన్ని శక్తిపీఠంగా గుర్తిస్తే వరంగల్ నగరం ఎంతో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని అంటున్నారు నగరవాసులు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో హైదరాబాద్ (Hyderabad) మహానగరం తరువాత అంతటి నగరం వరంగల్ మహానగరం. అయినా ఆశించిన స్థాయికి అభివృద్ధి చెందలేదని ఇక్కడి ప్రజల భావన. వరంగల్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కావడం లేదు.

వరంగల్ మహానగరం పర్యాటక ప్రదేశం కాబట్టి టూరిజంని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని, అయోధ్య కారిడార్, మధురై కారిడార్ ఎలాగైతే అభివృద్ధి చేశారో వరంగల్ నగరంలో ఉన్న భద్రకాళి దేవాలయాన్ని కూడా భద్రకాళి కారిడార్ గా అభివృద్ధి చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని భద్రకాళి ఆలయాన్ని శక్తిపీఠంగా గుర్తించాలని అంటున్నారు.

ఇది చదవండి: ఒక్క సంతకం విలువ రూ.5 లక్షలు.. ఎక్కడో తెలుసా?

ఓరుగల్లు నగరం అంటేనే ఎన్నో విశిష్టతలు కలిగిన దేవాలయాలు, పురాతన కట్టడాలు కాకతీయుల కాలంనాటి ప్రదేశం అని అందరికీ తెలిసిందే. దేశంలో ఎన్నో అమ్మవార్ల శక్తి పీఠాలు ఉన్నాయి. అయితే వరంగల్ కేంద్రంలోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది. హనుమకొండ వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు పెద్ద కళ్ళు, గంభీరమైన ముఖం, ఎనిమిది చేతులు.. వాటికి వేరు వేరు ఆయుధాలతో సింహ వాహనంపై కూర్చొని దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం రాతితో చేయబడి జీవం ఉట్టిపడేలా కనిపిస్తుంది.

క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు రెండవ పులకేసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. అయితే భద్రకాళి దేవాలయం గతంలో ఎన్నో దాడులను దోపిడీలను విధ్వంసాలను ఎదుర్కొంది. 1950 తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు సంపన్న వ్యాపారాలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవున భక్తులు విశేషంగా సందర్శిస్తుంటారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు