హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: కేటీఆర్ సీఎం కావాలని BRS నేత ఏం చేశాడో తెలుసా?

KTR: కేటీఆర్ సీఎం కావాలని BRS నేత ఏం చేశాడో తెలుసా?

X
chairs

chairs

సీఎం కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చోవాలని BRS నేత ఏం చేశాడో తెలుసా?

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

(Santhosh, News 18, Warangal)

సీఎం కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సీఎం కావాలని ఆశిస్తూ పేద ప్రజలకు 200 కుర్చీలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి పంపిణీ చేశారు.

ఈరోజు వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా సెంటర్ లో నిరుపేద ప్రజలకు ఈ కుర్చీలను పంపిణీ చేశారు.

అనంతరం శ్రీహరి మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ తెలంగాణకు చాలా కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని..అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ఒక రోల్ మాడల్ గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.  ఈ సందర్భంగా కేటీఆర్ రాబోయే రోజుల్లో సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశిస్తూ పేద ప్రజలకు 200 కుర్చీలను పంపిణీ చేసినట్లు రాజనాల శ్రీహరి తెలిపారు.

ఇదిలా ఉంటే గతంలో రాజనాల శ్రీహరి దసరా పండుగ సందర్భంగా హమాలీ కార్మికులకు మద్యం, కోళ్లను పంపిణీ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అదేవిధంగా శీతాకాలం ఆరంభంలో యాచకులకు దుప్పట్లను అందజేస్తారు. రాజనాల శ్రీహరి చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై నగరవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులకు గాలిపటాలను కూడా అందిస్తానని శ్రీహరి స్పష్టం చేశారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు