• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • WARANGAL KONDA FAMILY DECLARE THAT NO JOINING IN YS SHARMILA PARTY

warangal : డబ్బు కంటే పరువు ముఖ్యం ..కొండ దంపతులు..షర్మిలకు హ్యండ్ ఇచ్చిన దంపతులు

warangal : డబ్బు కంటే పరువు ముఖ్యం ..కొండ దంపతులు..షర్మిలకు హ్యండ్ ఇచ్చిన దంపతులు

కొండా మురళి, కొండా సురేఖ (File)

warangal :వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయో పార్టీలోకి వెళ్లమని కొండ దంపతులు స్పష్టం చేశారు. డబ్బు కంటే పరువు ముఖ్యమని ఈ సంధర్బంగా పేర్కోన్నారు. పార్టీలో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:


వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయో పార్టీ తీర్థం పుచ్చుకోనని కొండదంపతులు స్ఫష్టం చేశారు. దీంతో కొద్ది రోజులుగా వార్తలకు వారు ఫుల్ స్టాప్ పెట్టారు ఈ నేపథ్యంలోనే తమకు పార్టీలు, డబ్బులకంటే ఆత్మాభిమానం ముఖ్యమని కొండదంపతులు తేల్చేశారు. పార్టీలకంటే కొన్ని విలువలు ముఖ్యమని కొండ మురళి స్ఫష్టం చేశారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని , భవిష్యత్ కూడ అదే పార్టీలో కొనసాగుతానని అన్నారు. వారికి గతంలో పార్టీలు మారడం వల్ల కొన్ని చేదు అనుభావాలు ఎదురయ్యాయని వారు గుర్తు చేసుకున్నారు.

కాగా ఇటివల ఖమ్మం సంకల్ప సభలో ప్రసంగించిన వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే..దీంతో అధికార పార్టీ వ్యతిరేక వర్గాలతో పాటు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు షర్మిల తాను పెట్టబోయో పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో తెలంగాణ జిల్లాలో రాజకీయ పలుకుబడి ఉన్న కొండమురళి దంపతులను కూడ ఆమె సంప్రదించారు. దీంతో కొద్ది రోజులుగా కొండా దంపతులు షర్మిల ఏర్పాటు చేయబోయో పార్టీలోకి వెళతారనే ప్రచారానికి తెర లేచింది.

కాని కొద్ది రోజుల్లోనే కొండదంపతులకు ఈ విషయపై క్లారీటి ఇచ్చారు. పార్టీలో చేరుతారనే వార్తలపై వరంగల్‌లో తమ అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అయి చర్చించారు. అనంతరం తాము షర్మిల పార్టీలోకి వెళ్లడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వారి అసంతృప్తిని సీఎం జగన్‌పై వ్యక్తం చేశారు.వైఎస్ జ‌గ‌న్ ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామ‌న్న ఆయ‌న‌.. ఆ తర్వాత జగన్ కనీసం పలకరించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటీ సంధర్బంలో పార్టీ, డబ్బుల కంటే ఆత్మాభిమానం ముఖ్యమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి దయాకర్ రావు పై ఆయన సెటైర్లు వేశారు..ఏబిసీడిలు రాని మంత్రికి అవార్డులు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికార టీఆర్ఎస్ ఓవైపు కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే..మరోవైపు సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు..చంద్రబాబునే ఎదుర్కొన్నమాకు కేసీఆర్ ‌ను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని అన్నారు.
Published by:yveerash yveerash
First published: