హోమ్ /వార్తలు /తెలంగాణ /

క్యాన్సర్‌కు కార్పొరేట్ స్థాయిలో ఫ్రీ ట్రీట్‌మెంట్.. మందులు కూడా ఉచితం.. ఎక్కడంటే..!

క్యాన్సర్‌కు కార్పొరేట్ స్థాయిలో ఫ్రీ ట్రీట్‌మెంట్.. మందులు కూడా ఉచితం.. ఎక్కడంటే..!

X
వరంగల్

వరంగల్ కేఎంసీలో ఉచితంగా క్యాన్సర్ వైద్యం

Warangal: క్యాన్సర్ భారిన పడే సామాన్య బాధితులు బతుకుపై ఆశలు వదులుకునే పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Santosh, News18, Warangal

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ (Cancer) మహమ్మారి భారిన పడి ప్రతి ఏడాది అనేక మంది మృత్యువాత పడుతున్నారు. క్యాన్సర్ వ్యాధి సోకిందంటే ఒకప్పుడు చాలా భయపడాల్సి వచ్చేది. ప్రైవేటు ఆసుపత్రుల్లో తప్ప చికిత్స ఎక్కడా లభించేది కూడా కాదు. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. దీంతో క్యాన్సర్ భారిన పడే సామాన్య బాధితులు బతుకుపై ఆశలు వదులుకునే పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాక తాము అండగా నిలుస్తామంటూ వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజి (Kakatiya Medical College) లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు భరోసా ఇస్తున్నారు.

కేఎంసీలో కార్పొరేట్ స్థాయి వైద్యం: క్యాన్సర్ భారిన పడిన బాధితులు మనోధైర్యంతో ఉండాలని కేఎంసీ వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ క్యాన్సర్ అంటే భయపడకుండా ప్రజలు ముందుకు రావాలని కాకతీయ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంకాలజీ వైద్య విభాగం హెచ్ఓడి డాక్టర్ రఘురామన్ అన్నారు. ఈ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. 8 మంది వైద్యుల బృందంతో క్యాన్సర్‌కు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, అత్యాధునిక వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ బాధితులకు రూ. 60 వేల విలువైన మందులు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను క్యాన్సర్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రఘురామన్ సూచించారు.

ఇది చదవండి: పొడవాటి చెట్లలో ప్రకృతి ప్రసాదం.., తాటి, ఈత కల్లులో ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు

ఈ వ్యాధికి నాలుగు దశల్లో చికిత్స అందిస్తున్నారు. మొదటి రెండు దశల్లో శాస్త్ర చికిత్స అందించే విధంగా, మూడో దశలో రేడియేషన్, కీమోథెరపీ చేసి నాలుగో దశలో శస్త్ర చికిత్స కీమోథెరపీ రేడియేషన్ ఇస్తామని వైద్యులు వివరించారు. బ్లడ్ క్యాన్సర్‌కు మూలుగా మార్పిడి ద్వారా చికిత్స చేస్తామన్నారు. ప్రస్తుతం కెఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 20 పడగల ప్రత్యేక వార్డుతో పాటు పది మంది వరకు దీర్ఘకాలిక రోగులు చికిత్స పొందే విధంగా ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం వచ్చేవారికి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, పథకాల కింద సర్జరీలూ, ఏ కార్డులు లేని వారికి ఉచితంగా కూడా సర్జరీలు అందిస్తున్నామని డాక్టర్ రఘురామన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

First published:

Tags: Cancer, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు