హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: పేరుకే యూనివర్సిటీ.. లోపలికెళ్లి చూస్తే..

Warangal: పేరుకే యూనివర్సిటీ.. లోపలికెళ్లి చూస్తే..

X
కాకతీయ

కాకతీయ యూనివర్సిటీలో బూజుపట్టిన లైబ్రరీ

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కొన్ని నెలలుగా గ్రూప్ టూ, గ్రూప్ త్రీ పరీక్షల కోసం యువత సిద్ధం అవుతుంది. వారి కలలను సహకారం చేస్తూ తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి (TSPSC) ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కొన్ని నెలలుగా గ్రూప్ టూ, గ్రూప్ త్రీ పరీక్షల కోసం యువత సిద్ధం అవుతుంది. వారి కలలను సహకారం చేస్తూ తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి (TSPSC) ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువత గ్రంథాలయం బాట పట్టింది. అయితే, గ్రంథాలయంలో లోపల స్థలం లేకపోవడంతో ఆవరణలోనే కూర్చొని పుస్తకాలతో కుష్టిబడుతున్నారు. విద్యార్థులు ప్రస్తుతం పోటీ పరీక్షలకు సన్నతమవుతున్న వందలాది విద్యార్థులతో కాకతీయ విశ్వవిద్యాలయం జిల్లా కేంద్ర కళకళలాడుతున్నాయి. హనుమకొండలోని కాకతీయ విశ్వ విద్యాలయం (Kakatiya University) లో ఉన్న గ్రంధాలయం ఆధునిక హంగులతో రూపుదిద్దుకుందని చెప్పుకుంటారు.

అయితే,సకల సౌకర్యాలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు, పుస్తక ప్రియులకు విద్యార్థులకు వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉండాలి. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, పాఠకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణం కలిగివుండాలి. కొత్త కొత్త పుస్తకాలను ఎప్పటికప్పుడు తీసుకురావాలని విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విద్యార్థులు అంటున్నారు.

ఇది చదవండి: భద్రాచలంలో ఏం జరుగుతోంది..? లడ్డూ వివాదం వెనుక ఉన్నది ఎవరు.?

ఈ గ్రంధాలయంలో కొన్ని లోపాలుండగా.. కనీసం చెట్లకు నీరు పోసేవారు కూడా లేరు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే పాఠకులు, విద్యార్థులు మొక్కలకి నీరు పోస్తారు. ఇక్కడ ఉన్న బాత్రూం, మంచినీటి సమస్యలు, సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కరువై మైంటైన్ చేయలేకపోతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ లైబ్రరీలో డిజిటల్ పనులు ఆగిపోయాయి. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, పాఠకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అదీ సరైన పద్దతిలో లేదు. ప్రశాంతమైన వాతావరణం ఉంది కానీ.. కొత్త కొత్త పుస్తకాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావడంలేదు.

ఇంటర్నెట్ సదుపాయం లేక బైటవాటిపై ఆధారపడవలసి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక్కడ ఉన్న లైబ్రరీకి సుమారు రోజుకు అనేకప్రాంతాల నుండి సుమారు1500 మంది వరకు పాఠకులు, విద్యార్థులు వస్తారు. వీరిలో ఎక్కువ శాతం మహిళలు కాగా.. బాత్రూంల సదుపాయాలు సరిగా లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారు పార్కింగ్ స్థలం కూడా లేకపోవడంతో సమస్యలు ఎదురుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవతో ఇక్కడ ఉన్న లోటును తీర్చాలని విద్యార్థి సంఘం నాయకుడు అంటున్నాడు.

First published:

Tags: Kakatiya university, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు