హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రమాదంలో కాకతీయుల చరిత్ర.. ఇంత జరుగుతున్న సర్కార్ పట్టించుకోదా..?

ప్రమాదంలో కాకతీయుల చరిత్ర.. ఇంత జరుగుతున్న సర్కార్ పట్టించుకోదా..?

X
కబ్జాకోరల్లో

కబ్జాకోరల్లో కాకతీయుల కోటలు

కాకతీయుల కాలం (Kakatiya Empire) లో శతృవులు కోటలోకి ప్రవేశించకుండా నిర్మించిన కోటచుట్టు ఉన్న చెరువులు, కుంటలు భూ అక్రమార్కుల బారిన పడి అన్యాక్రాంతం అవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

కాకతీయుల కాలం (Kakatiya Empire) లో శతృవులు కోటలోకి ప్రవేశించకుండా నిర్మించిన కోటచుట్టు ఉన్న చెరువులు, కుంటలు భూ అక్రమార్కుల బారిన పడి అన్యాక్రాంతం అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కోట చుట్టూ ఇల్లు, గుడిసెలు వెలిశాయి. ఈ విషయం గురించి పట్టించుకునేవారు కరువయ్యారు. అలనాటి చారిత్రక కట్టడాలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఖిల్లా వరంగల్ (Warangal) రాతి, మట్టి కోటకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను నిర్మించారు. 2010 పురావస్తు శాఖ ఆక్ట్ ప్రకారం పురావస్తు కట్టడాల సమీపంలో 100 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా గుర్తించారు. ఆ తర్వాత 101 నుంచి 200 మీటర్ల ప్రాంతం వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి తీసుకొని ఇల్లు తదితర కట్టడాలను నిర్మించుకోవచ్చు.

మట్టి కోట అవతల శివనగర్ ప్రక్కనగల ప్రాంతంలో సీపీఎం , సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో 20 ఎకరాలు, ఏసి రెడ్డి నగర్ లో 10 ఎకరాలు, మైసయ్య నగర్, అలాగే చింతల్ ప్రాంతంలో 20 ఎకరాలు, శంభునిపేట ప్రాంతాలలో గుడిసెలు వెలిశాయి. ప్రభుత్వ స్థలం సుమారు 60 ఎకరాలలో గుడిసెలు వెలిశాయి. కాకతీయులు శత్రువుల నుంచి ప్రజలను రక్షించుకోవడానికి కోట చుట్టూ ఏడు కోటలను రక్షణ కవచాలుగా నిర్మించారు.

ఇది చదవండి: ఇప్పటికీ అక్షరాస్యతలో అట్టడుగునే ఈ జిల్లా!

రాతికోట, మట్టి కోట, పుట్టకోట, జలకోట, కంపకోట తదితర కోటలను నిర్మించారు. అందులో కట్ట మైసమ్మ, మొగిలిచర్ల కనపర్తి తదితర ప్రాంతాల్లో ఉన్న పుట్టకోటను రాజకీయ నాయకులతో పాటు శివారు ప్రాంతంలోని రైతులు, అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. దీంతో పుట్టకోట, దాని ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఖిలా వరంగల్ మట్టి కోట చుట్టూ సుమారు 7.5 కిలోమీటర్ల మేర, రాతికోట చుట్టూ నాలుగు కిలోమీటర్లు కందకాలు తవ్వి చెరువులు కుంటలను ఏర్పాటు చేశారు.

రాతి, మట్టి కోటల చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు రాజకీయ నాయకుల కబ్జాతో పేదల కోసం వేస్తున్న గుడిసెలతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఖిలా వరంగల్ లోని మూడు కోటల ప్రాంతంలో ఒకటి, రెండు అంతస్తులు మాత్రమే నిర్మించాలని నిబంధనలు ఉండగా బహుళ అంతస్తులు నిర్మించడంతో కోటలు కనుమరుగవుతున్నాయని స్థానికులు, పర్యాటకులు వాపోతున్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుత కట్టడాలు, నిర్మాణాలు, శిల్ప సంపదలు కలిగిన ఖీలా వరంగల్ కోట చుట్టూ గుడిసెలు, బహుళ అంతస్తులను నిర్మిస్తున్నా.. నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని.. దీంతో స్థలాలు అన్యక్రాంతమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు