Crime news: అతడికి కబడ్డీ అంటే ప్రాణం.. తన చివరి మజిలీ కూడా కబడ్డీ కోర్టే అయింది.. విషయం ఏంటంటే..

కబడ్డీ కోర్టులోనే గుంత తవ్వన దృశ్యం

Crime news: కబడ్డీ కోర్టే ఆ క్రీడాకారుడికి చివరి మజిలీ అయింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ కానిస్టేబుల్‌ని తోటి క్రీడాకారు లు, కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకంగా కబడ్డీ కోర్టు గీసి అందులో గుంతతీసి ఖననం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    అతడికి చిన్నతనం నుంచే ఆటలు అంటే ఎంతో ఇష్టం. ఎక్కడ చిన్నపాటి టోర్నమెంట్ పెట్టినా అక్కడకు వెళ్లి పాల్గొనేవాడు. అంతేకాకుండా ఎక్కడ అతడు పార్టిసిపేట్ చేసినా విజయం మాత్రం అతడి సొంతం అయ్యేది. అంతలా ఆటల్లో ఒదిగిపోయాడు. అందులో ముఖ్యంగా కబడ్డీ అంటే పడి చచ్చిపోతాడు. అంతలా ఇష్టం అతడికి. కబడ్డీలోనే అతడికి ఎన్నో పథకాలు, గౌరవ బిరుదులు వచ్చాయి. యూనివర్సిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ ఆడి ప్రతిభ కనబరిచి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. దీనిలో భాగంగానే అతడు స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. కానీ విధి అతడిని పగపట్టింది. ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. తర్వాత తోటి స్నేహితులు, క్రీడాకారులు అతడి శవాన్ని కబడ్డీ కోర్టు గీసి అందులో ఖననం చేశారు.

    ఈ ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లికి చెందిన పిట్టల కిరణ్‌(35)కు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ప్రాణం. యూనివర్సిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ ఆడి ప్రతిభ కనబరిచి మంచి పేరు తెచ్చుకున్నారు. 2009లో స్పోర్ట్స్‌ కోటాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ రోజు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో కిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

    కిరణ్ (ఫైల్)


    కుటుంబ సభ్యులు, తోటి క్రీడాకారులు, స్నేహితులు వ్యవసాయ భూమిలో ప్రత్యేకంగా కబడ్డీ కోర్టును వేసి, అందులో గోయి తీసి ఖననం చేశారు. కబడ్డీ  అంటే ఎంతో మక్కువ ఉన్న అతడికి కబడ్డీ కోర్టే చివరి మజిలీ అయింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మార్పాటి మహేందర్‌రెడ్డి మృతదేహంపై క్రీడాదుస్తులను ఉంచి నివాళులు అర్పించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Veera Babu
    First published: