హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: నమ్మకానికి సైన్స్ కి తేడా ఇదే..! ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం..!

Warangal: నమ్మకానికి సైన్స్ కి తేడా ఇదే..! ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం..!

X
విద్యార్థులకు

విద్యార్థులకు జన విజ్ఞానవేదిక అవగాహన కార్యక్రమం

Warangal: మూఢనమ్మకాలకు, సైన్స్ కు ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడంలో తమ ప్రతిభను చాటుతున్నారు పాఠశాల విద్యార్థులు. వారి ప్రశ్నలతో జవాబులతో ఆకట్టుకున్నారు చిన్నారులు. అసలు సైన్స్ అంటే ఏంటి.. ఐతే విద్యార్థులకు ఈ అంశాలపై అవగాహనా కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కొంతమంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Santosh, News18, Warangal

మూఢనమ్మకాలకు, సైన్స్ కు ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడంలో తమ ప్రతిభను చాటుతున్నారు పాఠశాల విద్యార్థులు. వారి ప్రశ్నలతో జవాబులతో ఆకట్టుకున్నారు చిన్నారులు. అసలు సైన్స్ అంటే ఏంటి.. ఐతే విద్యార్థులకు ఈ అంశాలపై అవగాహనా కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కొంతమంది. వరంగల్ (Warangal) కేంద్రంలో పలు పాఠశాలల్లో జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ సంబరాలు కోలాహాలంగా జరుగుతున్నాయి. ఏటా ఒక్కసారి నిర్వహించే వేడుకలు వేలాదిమంది విద్యార్థులు పాల్గొంటారు. విద్యార్థుల్లో శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చెకుముకి ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ టాలెంట్ టెస్టులో ఉపగ్రహ నమూనాలు అంతరిక్ష పరిశోధనలపై వాహన కల్పించే విధంగా ఉంటాయి. ఆకాశం నక్షత్రాలపై సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి విషయాల గురించి తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి.

మానవ శరీర నిర్మాణం, జీవ పరిణామ సిద్ధాంతం, వాతావరణంలో ఉండే మార్పులు మొదలైన అంశాలపై.. అడవి ఉత్పత్తులు, వన్యప్రాణి సంరక్షణ, జల సంరక్షణ మొదలగు అంశాలపై అవగాహన కల్పించే ప్రశ్నలు ఉంటాయి. చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ఎంతో విజ్ఞానవంతంగా ఉంటాయని విద్యార్థులు అంటున్నారు. ఇలాంటి సైన్స్ టాలెంట్ టెస్ట్ వల్ల ఎన్నో రకాల విషయాల్లో తెలుసుకుంటున్నామని మానవ శరీరంలో రక్త ప్రసరణ జీవ ప్రక్రియపై అవగాహన కలిగే విధంగా ఉందంటున్నారు విద్యార్థులు.

ఇది చదవండి: కేటీఆర్ మెచ్చిన స్కూల్ ఇదే..! అంతలా ఏముంది అక్కడ..?

ప్రజలలో మూఢనమ్మకాలు పోయేలా విద్యార్థులకు శాస్త్ర పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపాల్ అన్నారు. ఈ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే శక్తి లభిస్తుందని వరంగల్లోని రాజేంద్రనగర్ పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్ అన్నారు.

తమకు శాస్త్ర పరిజ్ఞానం పై అవగాహన కల్పించేందుకు జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విద్యార్దులు అంటున్నారు. ఈ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో తాము చాలా ఆసక్తికరంగా పాల్గొన్నామని, ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే శక్తి లభిస్తుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనవిజ్ఞాన వేదిక వారికి, తమను ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపాల్ కి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు