WARANGAL INTER STUDENT COMMITS SUICIDE FOR FEAR OF PRINCIPAL FOR CHEWING GUTKA VRY
Student suicide : కాలేజీ స్టూడెంట్‌కు గుట్కా అలవాటు.. పట్టించిన వాచ్మెన్.. ఆ తర్వాత విషాదం
student suicide
Student suicide : ఓ వైపు స్కూలు యజమాన్యం, మరోవైపు తల్లిదండ్రుల భయం వెరసి కొంతమంది విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి.. పిల్లలకు తెలియకుండా చెడు అలవాట్లు వారి ప్రాణాలకు విలువకడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గుట్కాలు నిషేధించినా .. అక్రమార్కుల దందాతో ఓ విద్యార్థి ప్రాణాలు తీశాయి. ఇంటర్ చదువుతున్న సమయంలోనే గుట్కాలకు అలవాటు పడి ఏకంగా కాలేజీ అవరణలో గుట్కాలు తినేందుకు ఆ విద్యార్థి ప్రయత్నించాడు. అయితే గుట్కాలను కాలేజీ లోపలకు తీసుకువెళుతున్న ఆ విద్యార్థిని వాచ్మెన్ చెక్ చేయడంతో విషయం బయటపడింది. దీంతో వెంటనే వాచ్మెన్ విద్యార్థి వద్ద ఉన్న గుట్కాలను వీడియో తీసి దాన్ని ప్రిన్సిపల్‌కు పంపాడు.. దీంతో భయపడిన ఆ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా ( Warangal ) శాయంపేట మండలం ఆరెపల్లికి చెందిన రవికుమార్ అనే విద్యార్థి ధర్మసాగర్ మండలంలోని మహత్మాజ్యోతిరావుపూలే జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థికి నిషేధిత గుట్కాలు తినే అలవాటు ఉండడంతో గడిచిన ఆదివారం కళాశాలలో బయటకు వెళ్లి గుట్కాలు కొనుగోలు చేసి కళాశాల లోపలికి తీసుకువస్తుండగా వాచ్‌మన్ చూసి ఫొటోతీసి ప్రిన్సిపాల్‌కు పంపాడు.
కాగా ప్రిన్సిపాల్ నేరుగా విద్యార్థిని మందలించకుండా... విద్యార్థి తండ్రి రవికి ఫోన్‌చేసి చెప్పగా కాలేజీకి వచ్చి మాట్లాడుతానని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి వస్తే ఏమి జరుగుతుందోనని భయపడి అదేరోజు పారిపోయి మండలంలోని తిరుమలగిరిలోని వారి వ్యవసాయ బావి వద్దకు వచ్చి అక్కడ ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అనంతరం సోమవారం ఉదయం తెల్లవారు జామున శాయంపేట మండలంలోని ఆరెపల్లిలోని ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం పరకాలలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పురుగుల మందు తాగి అక్కడ పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. కాగా, ఓ కానిస్టేబల్ జైరాజ్ సూచనమేరకు విద్యార్థి నేత్రాలను దానం చేశారు.
ఇలా ఇటివల ఖమ్మం కొత్తగూడెం ( Kothagudem )జిల్లాలో కూడా ఇలాంటీ సంఘటన చోటు చేసుకుంది. పదవతరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన స్కూళ్లోనే బర్త్‌డే పార్టీ చేసుకున్నాడు. దీంతో సీసీ కెమెరాల ద్వారా ఇది గమనించిన స్కూలు యజమానం విద్యార్ధిని మందలియడంతో పాటు ఆ విద్యార్థి తండ్రికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తండ్రి స్కూలు వచ్చి ఆ విద్యార్థిని మరోసారి మందలించాడు. ఇదిలా ఉండగా స్కూలు యజమాన్యం కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు విద్యార్థిని సస్పెండ్ చేసింది. అటు స్కూలు యజమాన్యంతో పాటు ఇటు తల్లిదండ్రులు కూడా మందలించడంతో మనోవేదనకు గురై ఇంట్లోనే ఆత్మహత్య యత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. మరో విషాదం కూడా ఇందుకు తోడైంది. విద్యార్థి చావును తట్టుకోలేని తండ్రి కూడా స్మశానవాటికకు వెళ్లి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.