Santosh, News18, Warangal.
చారిత్రాత్మక నగరం, పురాతన కట్టడాలు, ఎన్నో విశిష్టతలు కలిగిన దేవాలయాలు.. ఇవన్నీ చూడటానికి బాగానే ఉన్నా రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు వరంగల్ నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనిపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ...
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. కాజీపేట, హనుమకొండ, వరంగల్ కలిసి జనాభా సుమారు 15 లక్షలు ఉంటుంది. నగరానికి రోజు అనేక ప్రాంతాల నుండి తమ సొంత పనులపై కొంతమంది.. ఇక్కడ ఉన్న కట్టడాలను చూడటానికి పర్యాటకులూ వేలాది మంది వస్తుంటారు. దీంతో నగరంలో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. షాపింగ్ మాల్స్ కి సెల్లార్ లేకపోవడంతో రోడ్డు మీద పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగాయి. గతంలో సీఎం పర్యటనకు వచ్చినప్పుడు రోడ్లు విస్తరణ చేయాలని అధికారులను ఆదేశించారు.
సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడం, ఎక్కడా పార్కింగ్ స్థలం లేకపోవడం ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తుంది. కాజీపేట, హనుమకొండ, వరంగల్ కి 16 జంక్షన్లను కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కొత్తగా భవనాలు నిర్మించుకునేవారు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని కూడా కార్పొరేషన్ చెప్పింది. కొన్ని భవనాలు సెల్లార్లలో షెటర్లు ఏర్పాటు చేశారు.
కనీస నిబంధనలు పాటించకుండా నగరంలో నిర్మాణాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు ఏర్పడగా.. మరమ్మతు పనులు పూర్తి మొదలు పెట్టారు. అయితే, అవి పూర్తికాక ముందే మరోచోట తవ్వకాలు జరపడంతో ప్రజలు ఊరు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని.. ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే కల్పిచుకొని పరిష్కరించాలని కోరుతున్నారు.
Nagarkurnool: ఎంకరేజ్ చేస్తే!...ఇలా ఆడి చూపిస్తాం..!
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజలు ఈ సమస్య ఎదుర్కోవడానికి మూల కారణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం చెందిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నాణ్యత పై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ప్రజల సమస్యపై దృష్టి సాధించాలని బిజెపి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Traffic rules, Warangal