రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్సార్ యూనివర్సిటీ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. విద్యార్థుల సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్ చోరి చేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరు బావిలో పడగా మరొకరిని పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మరొకరు పారిపోయారు. ఇద్దరు దొంగలను హాసనపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఆర్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్టర్ హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మరొకచోట చైన్స్ మ్యాచింగ్:
అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో చైన్ స్నాచింగ్ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చెందిన గుండు వసంత మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడు దొంగలు లాక్కెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ఆలయంలో హుండీ చోరీ:
వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న కాశీబుగ్గ ఓసిటిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో దొంగలు హుండీలను పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నగరంలో గత కొద్ది రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతుండగా నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహిళలు బయటకు వెళ్లాలన్నా, పిల్లలను బయటకు పంపించాలన్న భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. అయితే, వరంగల్ నగర ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికాల్సిన అవసరం లేదని, పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ముమ్మర చర్యలు చేపడుతున్నామని, ముఖ్యంగా మహిళలు మాత్రం బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Telangana, Warangal