హోమ్ /వార్తలు /తెలంగాణ /

Wife and Husband: భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందనే కోపంతో ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

Wife and Husband: భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందనే కోపంతో ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

భార్య, భర్తలు (ఫైల్​)

భార్య, భర్తలు (ఫైల్​)

మద్యానికి బానిసైన భర్త...కట్టుకున్న భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. దీంతో అభం శుభం తెలియని ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవాని నగర్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly, News18, Mulugu)

  మద్యానికి (Alcohol) బానిసైన భర్త (Husband).. కట్టుకున్న భార్య (Wife)ను అతికిరాతకంగా హత్య చేశాడు. దీంతో అభం శుభం తెలియని ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. మహబూబాబాద్ (Mahabubaad) జిల్లా కేంద్రంలోని భవాని నగర్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. జాటోత్ భాస్కర్, కల్పన ఇద్దరు 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా స్వరూప, రుచిత, వర్షిత అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భాస్కర్ మొదట్లో మటన్ షాప్‌లో పనికి కుదరగా కల్పన ఇంటి వద్ద ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేది. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన భాస్కర్ తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు.

  Sad story: ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు.. వారి బంధాన్ని పెద్దలు ఒప్పుకోలేదని యువకుడు ఎంత పని చేశాడంటే..

  తరచూ మద్యం తాగి వస్తుండడంతో పని సరిగా నిర్వహించకపోయేవాడు. దీంతో భాస్కర్‌ను పని నుంచి తొలగించాడు మటన్ షాప్ ఓనర్. అనంతరం ఓ చికెన్ సెంటర్ పెట్టిన భాస్కర్ దాన్ని కూడా సరిగా నిర్వహించుకోలేకపోయాడు. పొద్దస్తమానం తాగుతూ భార్య కల్పనతో గొడవ పడుతూ ఉండేవాడు. తనకు డబ్బులు కావాలని ఇబ్బంది కూడా పెట్టేవాడు. భర్త తీరుతో విసిగిపోయిన కల్పనా తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులకు వెళ్తూ కల్పన జీవనం సాగిస్తుంది.

  రోజువారిలాగే పనికి వెళ్తున్న కల్పన కోసం మాటు వేశాడు భాస్కర్. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై కత్తితో మెడపై దాడి చేశాడు. దీంతో వెంటనే కల్పన స్పృహ తప్పి అక్కడిక్కడే కూలిపోయింది. అనంతరం కొద్దిసేపటికే మృతి చెందింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భాస్కర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మద్యానికి బానిసై క్షణికావేశంలో చేసిన ఘటనకు తన జీవితం జైలు పాలవడంతో పాటు ముగ్గురి ఆడపిల్లల బతుకు రోడ్డుపై పడింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Mahabubabad, Mulugu, Warangal

  ఉత్తమ కథలు