Home /News /telangana /

WARANGAL HUSBAND HOLDING WIFE RED HANDED IN ROOM WITH BOYFRIEND IN MULUGU DISTRICT SNR

Mulugu:మొగుడికి మస్కా కొట్టింది..ప్రియుడితో మజా చేస్తూ ఆ విధంగా బుక్కైంది

(భార్య రంకు బయటపెట్టిన భర్త)

(భార్య రంకు బయటపెట్టిన భర్త)

Extramarital affair:ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే మస్కా కొట్టించింది. ఇంటర్‌ క్లాస్‌మెట్‌తో సీక్రెట్‌గా దుకాణం పెట్టింది. భర్త అనుమానిస్తే గొడవపడింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో సిగ్గుతో తలదించుకుంది. ములుగు జిల్లాలో ఓ మహిళా ఉద్యోగిని ఇదంతా చేసింది

ఇంకా చదవండి ...
కొంత మంది వైవాహిక జీవితాల్లో వేరే వ్యక్తులతో ఉండే సాన్నిహిత్యం వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయి. ములుగు జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకొని హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్న దంపతుల కాపురంలో వివాహేతర సంబంధం కాపురాన్ని ముక్కలు చేసింది. ములుగు(Mulugu) జిల్లా ఏటూరునాగారం(Eturnagaram) మండలం దొడ్లలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌(Forest Department)‌లో మహిళ జాబ్ చేస్తోంది. ఆమె భర్త చర్ల(Charla)లో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ప్రేమించుకొని 8సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే ఉద్యోగాల రిత్య మహిళ చిన్నబోయినపల్లి(Chinnaboinapalli)లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త చర్లలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ వేర్వేరు చోట్ల ఉద్యోగం చేయడం మహిళ వివాహేతర సంబంధం(Extramarital affair)పెట్టుకోవడానికి కారణమైంది. అయితే భార్య తీరుపై అనుమానం రావడంతో భర్త పలుమార్లు ఆమెను నిలదీశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. ఈవిషయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తల్లి అల్లుడితో గొడవపడింది. చూడకుండా అనుమానిస్తే ఊరుకోను..నీ భార్య తప్పు చేస్తుందని రెడ్ హ్యాండెడ్‌(Red Handed‌)గా పట్టుకోమని పెద్దల సమక్షంలోనే ఆగ్రహం చెప్పింది. భార్య తల్లి గ్రామపెద్దల సమక్షంలోనే పట్టుకోమని చెప్పడంతో మహిళపై నిఘా పెట్టాడు కార్యదర్శి.

భర్తను మాయ చేసి ప్రియుడితో మజా..
వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించిన సదరు మహిళ ఉద్యోగి చర్లకు చెందిన ఇంటర్ క్లాస్ మెంట్ రసాల లింగరాజుతో భర్తకు తెలియకుండా ప్రేమాయణం సాగిస్తోంది. అతను కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. భర్తకు తెలియకుండా ప్రియుడు లింగరాజుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్నట్లుగా తెలుసుకున్న భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భర్త భార్య బాగోతం బయటపెట్టాడు.

Husband holding wife red handed in room with boyfriend in Mulugu district|ములుగు జిల్లాలో ప్రియుడితో గదిలో ఉన్న భార్యను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
(భార్య బాగోతం బట్టబయలు)


బయటపడ్డ భార్య బాగోతం..
భార్య వివాహేతర సంబంధాన్నిరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఇద్దర్ని తాళ్లతో కట్టేసి భార్య ఉద్యోగం చేస్తూ నివాసం ఉండే చిన్నబోయినపల్లికి తీసుకొచ్చాడు. అక్కడే ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి ప్రియుడితో దొరికిపోయిన మహిళ ఉద్యోగిని బండారం బయటపెట్టాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న లింగరాజుకు దేహశుద్ధి చేశారు. అటుపై పోలీసులకు అప్పగించారు. అంతే కాదు కట్టుకున్న భార్య తప్పు చేస్తుందని ఎవరైనా అబద్ధం చెబుతారా అంటున్నాడు భర్త. ఆమె తప్పు చేస్తోందని ఎప్పటినుంచో చెబుతే ఎవ్వరు నమ్మలేదని, రెండుసార్లు తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య, ఆమె ప్రియుడు కలిసి మాట్లాడుకున్న ఫోన్‌ కాల్ రికార్డింగ్ ఆధారంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు చెప్పాడు.
Published by:Siva Nanduri
First published:

Tags: Illicit affair, Mulugu, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు