Home /News /telangana /

WARANGAL HUSBAND AND SON CREATE DEATH CERTIFICATE OF INSANE WOMAN IN HANUMAKONDA FOR RS 15 CRORE PROPERTY SNR

Crime news : భర్త, కొడుకు ఇద్దరూ కలిసి ఆమెను బ్రతికుండగానే చంపేశారు ..ఛీ అందుకోసం ఇంతటి దారుణమా

(FILE PHOTO)

(FILE PHOTO)

CRIME NEWS : మావన సంబంధాలన్ని ఆర్ధిక బంధలుగా మారిపోతున్నాయి. ఆస్తులు, డబ్బు కోసం కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకే ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
మావన సంబంధాలన్ని ఆర్ధిక బంధలుగా మారిపోతున్నాయి. ఆస్తులు, డబ్బు కోసం కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకే ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం ఆస్తిపై ఉన్న ఆశతో కుటుంబంలో కీలక సభ్యురాలిగా ఉన్న మహిళను పరాయి స్త్రీని చేసి వదిలించుకున్న ఘటన తెలంగాణలోని హనుమకొండ(Hanumakonda)లో చోటుచేసుకుంది. కేవలం మహిళ మానసిక స్థితి(Insane woman) సరిగాలేని కారణాన్ని అడ్డుపెట్టుకొని ఆమెకు చేసిన ద్రోహం గురించి తెలుసుకున్న పోలీసులు(Police) ఆశ్చర్యపోతున్నారు.

Love Cheater : ప్రియురాలికి అబార్షన్ చేయించి మరో యువతితో పెళ్లి .. పీటల మీదే చుక్కలు చూపించిన యువతి



ఆస్తి కోసం కుటుంబ సభ్యురాలికి ద్రోహం..
సమాజంలో మానవ సంబంధాలకే విలువే లేకుండా పోతుందని అందరూ అనుకుంటున్నారు. కాని రక్తసంబంధాలను కూడా తెచ్చుకుంటున్నారని హనుమకొండలో జరిగిన ఓ సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. హనుమకొండ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న ఒక మహిళ ఐదేళ్ల క్రితం అదృశ్యమై..ఇప్పుడు చెన్నైలో ప్రత్యక్షమైంది. ఆమె మానసికస్థితి సరిగా లేని కారణంగా కుటుంబసభ్యుల వివరాలు, తాను ఎవరో చెప్పలేకపోవడంతో ఆమెకు ఆశ్రయం కల్పించిన చెన్నైలోని ఆన్బగం రిహబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు ఆమె అడ్రస్, పేరు వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే భారీ కుట్రతో పాటు నమ్మలేని నిజాలు బయటడ్డాయి.



బలవంతంగా రైలు ఎక్కించారు..
మతిస్థిమితం సరిగా లేని మహిళ హనుమకొండకు చెందినట్లుగా గుర్తించారు. ఆధార్‌ కార్డు సృష్టించేందుకు చెన్నైలోని ఆధార్‌ కార్డు సెంటర్‌కు స్వచ్చంద సంస్థ నిర్వాహకులు తీసుకెళ్లగా అప్పటికే ఆమె పేరుతో ఆధార్‌ కార్డు ఉండటంతో వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి పేరు కనుగొన్నారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. 2017లో భర్త, కొడుకు ఇద్దరూ కలిసి ఆమెను రైలు ఎక్కించి ఇంటి నుంచి పంపించినట్లుగా తేల్చారు. బాధితురాలి పేరుతో సుమారు 15కోట్ల రూపాయల ఆస్తులు ఉండటంతో వాటిని తమ పేరుతో బదిలీ చేయమని భర్త, కొడుకు ఒత్తిడి చేశారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను ఇంటి నుంచి పంపించారు. మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఎటో వెళ్లిందని బంధువులు, స్థానికులకు నమ్మించారు. కొన్ని రోజుల తర్వాత వరంగల్‌ నగరపాలక సంస్థలో బాధితురాలు చనిపోయినట్లుగా డెత్‌ సర్టిఫికెట్ పుట్టించారు భర్త, కొడుకు. ఆమె పేరుతో ఉన్న 15కోట్ల రూపాయల ఆస్తిని తండ్రి, కొడుకు పంచుకున్నారు. సీన్ కట్ చేస్తే బాధితురాలి భర్త మరో మహిళను వివాహం చేసుకొని అమెరికాకు వెళ్లిపోయాడు. కొడుకు బెంగుళూరులో జాబ్‌ చేస్తున్నాడు.

Sad news : ఎస్‌ రాత పరీక్ష రాసింది .. ఫలితాలకు ముందే ఆమె తలరాత మారిపోయింది .. ఆ యువతి కథ చివరకు అలా ముగిసింది



చనిపోయినట్లుగా నమ్మించారు..
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వచ్చంద సంస్థ నిర్వాహకులు ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు ప్రయత్నించి ఆమె ఫోటోను కొడుకుకి పంపడం అతను తనకు బాధితురాలు తెలియదని ..తన తల్లి ఎప్పుడో చనిపోయిందని డెత్‌ సర్టిఫికెట్ చూపించడంతో అనుమానం మరింత బలపడింది. చివరగా బాధిత మహిళకు ఆశ్రయం కల్పించిన స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆస్తి కోసం భర్త, కొడుకు ఆడిన నాటకం బయటపడింది. అయితే ప్రస్తుతం బాధితురాలిని కుటుంబ సభ్యులు అనుమతిస్తే వారికి అప్పగిస్తామని సీఎం, గవర్నర్, హనుమకొండ కలెక్టర్‌కి లేఖ రాశారు స్వచ్చంద సంస్ధ నిర్వాహకులు. అలాగే ఆమెకు రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. ఆస్తి కోసం అమానవీయంగా ప్రవర్తించిన భర్త, కొడుకుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న భర్తను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Telangana News

తదుపరి వార్తలు