హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: చారిత్రాత్మక నగరం.. ట్రై సిటీ.. గ్రేటర్ వరంగల్ లో నీటి కష్టాలు

Warangal: చారిత్రాత్మక నగరం.. ట్రై సిటీ.. గ్రేటర్ వరంగల్ లో నీటి కష్టాలు

X
వరంగల్

వరంగల్ లో నీటి కష్టాలు

Warangal: ట్రై సిటిగా , చారిత్రాత్మక నగరంగా పేరున్న వరంగల్ లో నీటి కష్టాలను చవిచూస్తున్నారు ప్రజలు. ఒక్కోసారి రెండు మూడు రోజులైనా నీరురాక,పైప్లైన్లు పగిలిపోయి, నీళ్ల ట్యాంకుల్లో నీరు లేకకష్టాలు పడుతున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana | Warangal

Santhosh, News 18, Warangal

ట్రై సిటిగా , చారిత్రాత్మక నగరంగా పేరున్న వరంగల్ (Warangal) లో నీటి కష్టాలను చవిచూస్తున్నారు ప్రజలు. ఒక్కోసారి రెండు మూడు రోజులైనా నీరురాక,పైప్లైన్లు పగిలిపోయి, నీళ్ల ట్యాంకుల్లో నీరు లేకకష్టాలు పడుతున్నారు. ఓరుగల్లు జిల్లా ప్రజల త్రాగునీటి కష్టాలపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ..

ఓరుగల్లు నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. దానికి అనుకూలంగా తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. దీనితో వరంగల్ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా మారుతుంది.ఈ ఏడాది వర్షాలు అధికంగా పడినప్పటికీ తాగునీటి సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఓరుగల్లులో సుమారు పది లక్షలకు పైగా జనాభా ఉంటుంది. అయితే రోజుకు 290 మిలియన్ల లీటర్ల నీరు, ఐదు టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అధికారుల అంచనా.అయితే ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వేసవిలో ఎలా ఉంటుందోప్రజలు ఆందోళన చెందుతున్నారు.

విలీన గ్రామాల్లో అయితే వాటర్ ట్యాంక్ సదుపాయం లేక పైపులైన్లు లేక వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వాటర్ ట్యాంకర్ వారానికి ఒకసారి రావడం వల్ల బోరు నీళ్లు త్రాగడంతో రోగాల పాలవుతున్నామంటున్నారు. వారానికి ఒకసారి వాటర్ టాంకర్ రావడంతో ఒకరితో ఒకరికి గొడవలు జరుగుతూ ఉంటాయి. నాలుగు రోజులుగా నీళ్లు లేకపోయినా పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల వసూళ్ల మీద శ్రద్ధ చూపే అధికారులు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదంటూ పలుచోట్ల ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు.

ఇది చదవండి: రైతులకు ఇది నిజంగా వరం.. పంటను కాపాడే డివైజ్.. వివరాలివే..!

వరంగల్ కేంద్రంలోని కాశీబుగ్గ ప్రాంతంలోని చింత హరిజనవాడలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు వృత్తిరీత్యా ఎడ్లబండ్లపై వరంగల్ చుట్టుపక్క ప్రాంతాలల్లో ఇటుకలు సరఫరా చేస్తారు. ఇక్కడ నివసించే ఒక్కో కుటుంబానికి ఎడ్ల బండ్లు ఉంటాయి. ఈ కాలనీలో రెండు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులతోపాటు 20 సంవత్సరాలుగా మూతపడి ఉన్న ఒక సర్కార్ భావి ఉంటుంది. ఐనప్పటికీ వీరందరికీ త్రాగునీటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

ఇది చదవండి: ఇలాగైతే ఎలా..? అధికారులకు పరుగులు పెట్టించిన కలెక్టర్

గత కొద్దిరోజులుగా మిషన్ మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాము తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మూగజీవులు ఎలా ఉంటాయని వాపోయారు. కనీసం ఇప్పటికైనా అధికారులు క్షణమే స్పందించి కాలనీలో ఉన్న సర్కారు బావిని తెరిపించాలని కోరారు.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు