Home /News /telangana /

WARANGAL GUESTS ON BEHALF OF THE TELANGANA GOVERNMENT ATTENDED THE WEDDING OF WARANGAL KALPANA DAUGHTER CHANDRAKALA WHO WAS THE INSPIRATION FOR THE KALYANA LAKSHMI PRV

Kalyana Laxmi: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ పథకాలు కేసీఆర్ మదిలో మెదలడానికి ప్రేరణ ఆ మహిళ.. 20 ఏళ్ల తర్వాత ఆమె కూతురి పెళ్లికి అతిథులుగా ఎవరొచ్చారో తెలుసా?

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

ఆడ బిడ్డల పెళ్లిల్లకు సాయంగా సీఎం కేసీఆర్​ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఆ పథకం పెట్టడానికి ఓ మహిళ కారణమట. ఆమె పేరే కల్పన. ఆమెది వరంగల్​. ఇపుడామె కూతురు వివాహం జరిగింది. అయితే ఆ వివాహానికి అనుకోని అతిథులు వెళ్లారు.

ఇంకా చదవండి ...
    20 సంవత్సరాల క్రితం. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్​ 2002 ఏప్రిల్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు వరంగల్ (Waranagal) జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో మల్లంపల్లి గ్రామ సమీపంలోని భాగ్య తండాలో భారీ అగ్నిప్రమాదం జరిగి 64 ఇళ్లు దగ్ధమయ్యాయి. బాధితులను ఓదార్చేందుకు అప్పటి టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ (CM KCR)తండాకు చేరుకున్నారు. తమ కుమార్తె కల్పన పెళ్లి కోసం తాము కొనుగోలు చేసిన బట్టలు, బంగారం, వెండి వస్తువులతో సహా అగ్నిప్రమాదంలో అన్నీ కోల్పోయామంటూ ఓ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

    కూతుళ్ల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బందులు..

    వారి పరిస్థితిని చూసి చలించిపోయిన కేసీఆర్ (KCR) కొద్ది రోజుల తర్వాత జరగాల్సిన పెళ్లికి ఏర్పాట్లు చేశారు, అదే సమయంలో కల్పన (Kalpana) పెళ్లికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించారు. అయితే పేదలు తమ కూతుళ్ల పెళ్లిళ్లు చేయడంలో పడుతున్న ఇబ్బందుల గురించి కేసీఆర్​ ఆలోచనలో పడ్డారు. అదే కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ సంక్షేమ పథకాల  అమలుకు దారితీసింది.

    వివాహానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా..

    ఇది SC, ST, BC మైనారిటీ కుటుంబాలకు చెందిన నూతన వధువుకు ₹ 1,00,116 ఆర్థిక సహాయం అందించడమే కాదు. ఇది బాల్య వివాహాలను నిరోధించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇది వివాహానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్దేశిస్తుంది. ఇపుడు ఆ కల్పన కూతురు (kalpana Daughter) చంద్రకళ పెళ్లి జరిగింది. అయితే ఈ శుభకార్యానికి అతిథులుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (satyavathi rathod)​, ఎమ్మెల్యే శంకర్​నాయక్​, ఇతర టీఆర్​ఎస్​ నాయకులు హాజరయ్యారు.

    అప్పట్లో కేసీఆర్ చేసిన పెళ్లి… ఆ తర్వాత ఆ పెళ్లి కూతురు బిడ్డ చంద్రకళ (kalpana Daughter chandrakala)  కు 20 ఏళ్ల తర్వాత వివాహం కావడం, దానికి మేమంతా హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి సత్యవతి తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం (kalyana laxmi) 10 లక్షల మంది ఆడపిల్లల జీవితాలలో వెలుగులు నింపిందని మంత్రి అన్నారు. కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమైందన్నారు. ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలు ఆర్థిక సాయంగా ఇవ్వడం సీఎం కేసిఆర్ ముందుచూపునకు నిదర్శనమన్నారు.

    పెళ్లి (Marriage)కి పెద్దలుగా వ్యవహరించి, వివాహం జరిపించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది స్వప్న దంపతులకు సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కల్పన బిడ్డ చంద్రకళ పెళ్లికి హాజరైన ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.

    ఆరోజు కేసిఆర్ ఉద్యమ నాయకునిగా, జిల్లా బాధ్యులుగా పెద్ది సుదర్శన్ రెడ్డిలు వున్నారని సత్యవతి చెప్పారు.  తెలంగాణ వచ్చాక కల్పన పడిన బాధ, ఆమె పెళ్లి స్ఫూర్తితో కళ్యాణ లక్ష్మి పథకం పెట్టారుని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. మొదట్లో ఈ పథకం కింద 51 వేల రూపాయలు, తరవాత 75 వేల రూపాయలు ఇచ్చి, ఇపుడు లక్షా 116 రూపాయిలు ఇస్తున్నారని మంత్రి అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Marriage, Warangal

    తదుపరి వార్తలు