Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal : పంట నష్టం పరీశీలనలో మంత్రులు.. సీఎం రాకపోవడానికి కారణాలు ఇవేనా..?

Warangal : పంట నష్టం పరీశీలనలో మంత్రులు.. సీఎం రాకపోవడానికి కారణాలు ఇవేనా..?

వరంగల్ లో మంత్రుల పర్యటన

వరంగల్ లో మంత్రుల పర్యటన

Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో (Warangal ) మంత్రుల పర్యటన ( Telangana Ministers ) కొనసాగుతోంది. జిల్లాలోని పరకాల సబ్ డివిజన్‌లో ఇటివల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను వారు పరీశీలించారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సారధ్యంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి , గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లు వెళ్లారు. వరంగల్ చేరుకున్న మంత్రుల బృందం పరకాల మండలంలోని నాగారం, మల్లక్కపేట, గ్రామాలతో పాటు నర్సంపేట డివిజన్‌లో కొన్ని ప్రాంతాలను దెబ్బతిన్న పంటలను పరీశీలించారు. అనంతరం రైతు కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని హమీ ఇచ్చారు. పంటల పరీశీలన అనంతరం మంత్రుల బృందం ప్రభుత్వానికి ఓ నివేదికను అందించనుంది. దాని ప్రకారం రైతులకు జరిగిన నష్టంపై ఓ అంచనాకు రానున్నారు.

కాగా వరంగల్‌ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా మూడు రోజలు పాటు విపరీతమైన వర్షాలు కురిశాయి.. దీంతో చేతికి అందివచ్చిన మిరప తోటలు నీటిపాలయ్యాయి. మరోవైపు ఆరబెట్టిన మిర్చి సైతం వర్షానికి కొట్టుకుపోయిన పరస్థితి ఎదురైంది. ఇక పండ్ల తోటలు సైతం నేల రాలాయి. ఇలా వందల కోట్ల రూపాయల పంటల నష్టం తెలంగాణ వ్యాప్తంగా జరిగినట్టు ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు..

Jagityala : తాతనే రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు..విపరీతంగా కొట్టాడు.. ఆ తర్వాత.. ( వీడియో.)

రైతులకు ఇంతపెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన నేపథ్యంలోనే సీఏం కేసిఆర్ నేరుగా రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని నిర్ణయించినా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. దీంతో కేవలం మంత్రుల బృందమే పర్యటిస్తోంది. అయితే సీఎం పర్యటన రద్దుకు కరోనా కారణం అని చెబుతున్నా కొన్ని రాజకీయ పరిణామాలు ఇందుకు దోహదపడ్డాయని చెబుతున్నారు. ఇప్పటికే జీవో 317పై ఆందోళనలు జరుగుతుండడం మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం ఇందుకోసం ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో రాజకీయ విమర్శలు చేసే అవకాశాలు నెలకొన్నాయి. ఇక మరోవైపు పంటలను పరీశీలించిన తర్వాత రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది. మరోవైపు ధాన్యం కొనుగో్ళ్లు కూడా నామమాత్రంగా కొనసాగుతుండడంతో స్థానిక రైతుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కాగా పంటల నష్టంపై వరంగల్ జిల్లా నేతలు సీఎం విజిట్ చేయాలని కోరడంతో పర్యాటన ఖారారైనట్టు చెప్పారు. ఆ తర్వాత సీఎం ప్రెస్ మీట్ సైతం రద్దు చేసుకున్న సీఎం ఆ తర్వాత వరంగల్ టూర్‌ను రద్దు చేసుకున్నారు. కాగా గత రెండు నెలల క్రితం కూడా వరంగల్ పర్యటన ఖరారు అయిన సంధర్భంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సీఎం పర్యటన రద్దయింది. ఒక వేళ సీఎం వరంగల్ జిల్లాలో పర్యటించినట్టయితే సెంట్రల్ జైలు  ఆవరణలో చేపట్టనున్న ఆసుపత్రితో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి.

First published:

Tags: Telangana, Warangal