Santosh, News18, Warangal
నిజాం నవాబులు రాష్ట్రంలో హైదరాబాద్ (Hyderabad) బేగంపేట విమానాశ్రయంతోపాటు వరంగల్ (Warangal) మామునూరు ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడా లేని విధంగా సుమారు 1800 ఎకరాల్లో సువిశాల స్థలంలో మామునూరు ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేశారు. 6.6 కిలోమీటర్ల రన్వేతో పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు 1981 వరకు విమాన సర్వీసులు కొనసాగాయి. 2007 సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడపలో విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నారు. రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అయితే, రెండు విమానాశ్రయాలకు సమానంగా నిధులు కేటాయించాల్సిన అప్పటి వైయస్సార్ సర్కార్ కేవలం కడపకు మాత్రమే నిధులు కేటాయించారు.
అప్పటి నుంచి మామునూరు ఎయిర్ పోర్ట్ ను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్ ఆధునికరణకు భూ సేకరణతో పాటు కాంపౌండ్ వాల్ కట్టేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సుమారు 700 ఎకరాల భూమిని విమానాశ్రయానికి ఉండగా 195 ఎకరాలతో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 25 కోట్ల నిధులకుగాను 10 కోట్లు విడుదల వేశారు. రన్వే విస్తరణకు 200 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వరంగల్ నగరం దేశంలోనే అభివృద్ధి చెందడానికి అత్యుత్తమ అవకాశాలు ఉన్నాయి. నేషనల్ హైవే, రైల్వే పరంగా కాజీపేట జంక్షన్ కనెక్టివిటీ ఉన్నాయి. మామునూర్ ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉన్నట్లయితే వరంగల్ మహా నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది.
అయితే మామునూరు ఎయిర్ పోర్ట్ దశాబ్ద కాలం నుండి మూతపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్ సమావేశాలలో ఉడాన్ పథకంలో భాగంగా మామునూరు ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి దశలో తీసుకెళ్లేందుకు ప్రతిపాదనలు చేశారు. హైదరాబాదు లాంటి మహానగరాలకు ఒత్తిడి తగ్గించాలంటే రాష్ట్రంలో రెండో మహానగరమైన ఓరుగల్లు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
అయితే ఐటి పరిశ్రమలు, ఇండస్ట్రీస్ రావాలన్న మామునూరు ఎయిర్ పోర్టును పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇరిగేషన్ ద్వారా మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరణ చేయడం వలన వరంగల్ నగరం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal