(Santhosh, News 18, Warangal)
వరంగల్ కేంద్రంలోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో ఉచిత టిఫా స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించారు. నిరుపేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రసూతి ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మెషిన్లు ఏర్పాటు చేసారు. 18 వారాల నుండి 22 వారాలు నిండిన గర్భిణీ స్త్రీకి పుట్టబోయే బిడ్డ అవయాలు సరిగ్గా ఉన్నాయా లేక ఏమైనా లోపాలున్నాయా అన్న నిర్దారణ కోసం ఈ టిఫా స్కానింగ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ సద్వినియొగం చేసుకోవాలన్నారు వరంగల్ CKM ప్రసూతి ఆసుపత్రి సూపరిండెంట్ పద్మ.
గర్భం దాల్చిన సమయం నుంచి మహిళలకు వైద్యులు రకరకాలు పరీక్షలు చేస్తూ ఉంటారు. ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటారు. టాబ్లెట్స్ వేసుకొమ్మంటుంటారు. అయినా ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో జన్మిస్తున్నారు.గర్భం దాల్చిన నాటి నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్నారులు పుట్టే వరకు వాళ్ల లోపాలు బయటపడటం లేదు. ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. గర్భిణీలందరికీ "టిఫా" స్కానింగ్ చేయించాలని నిర్ణయించింది.
అయితే.. ఈ స్కానింగ్ మీద ఇప్పటికీ చాలా మందిలో చాలా అనుమానాలున్నాయి. అసలు ఈ స్కాన్ ఎందుకు చేసుకోవాలి.. ఈ స్కానింగ్ వల్ల ఉపయోగాలేంటీ ఈ స్కాన్ వల్ల గర్భిణీకి గానీ గర్భంలోని శిశువుకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇలా ఎన్నో ప్రశ్నలు మొదళ్లను తొలిచేస్తుంటాయి. ఈ టిఫా స్కానింగ్ అనేది గర్భంలో ఉన్న శిశువుకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు చేస్తారు.
ఈ స్కాన్ ద్వారా ఆ లోపాలను గుర్తించటం వల్ల.. ముందు నుంచే అందుకు తగిన వైద్యం అందించి.. తల్లీబిడ్డలద్దరు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త పడొచ్చనేది ప్రధాన లక్ష్యం. అయితే.. ఈ స్కానింగ్ వల్ల గర్భంలోని శిశువుకు ఎమైనా సమస్య ఉంటుందా అన్నది చాలా మందిలో ఉన్న అపోహా మాత్రమే. శిశువుకు ఉన్న సమస్యలను ముందుగా తెలుసుకునేందుకే ఈ స్కానింగ్ అంటున్నారు వైద్యులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal