హోమ్ /వార్తలు /తెలంగాణ /

స్కూల్, కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ గంజాయి వ్యాపారం.. ముగ్గురు అరెస్ట్!

స్కూల్, కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ గంజాయి వ్యాపారం.. ముగ్గురు అరెస్ట్!

అక్రమ గంజాయి సరఫరా

అక్రమ గంజాయి సరఫరా

Telangana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను జనగామ జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను జనగామ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరిగొప్పుల గ్రామానికి చెందిన మటన్ వ్యాపారి ఎండి జలీల్, కొడకండ్ల మండలం రెగ్యులతండాకు చెందినకేలోతు నవీన్.. అదే తండాకు చెందిన చందూలాల్ గంజాయికి అలవాటు పడి దాన్నే చిన్న స్థాయి వ్యాపారంగా మార్చుకున్నారు.

సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేస్తూ రహస్యంగా ఇక్కడికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను టార్గెట్ చేస్తూ గంజాయి తాగడం అలవాటు చేస్తున్నారు. ఇందులో గంజాయికి అలవాటు పడిన కొంతమందిని అమ్మకం కోసం వినియోగించుకుంటున్నారు. ముగ్గురు స్మగ్లర్లు తమ గంజాయి వ్యాపార సామ్రాజ్యాన్ని రోజురోజుకు విస్తరించుకుంటూ పోతున్నారు.

వీరి ఉచ్చులో పడి వందల సంఖ్యలో విద్యార్థులు గంజాయికి అలవాటు పడి బానిసలుగా మారినట్లు పోలీసులు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు మండలాలకు సైతం గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి అమ్మకాలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్సై ఎస్కే జానీ బాషా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మండల కేంద్రం శివారు పెట్రోల్ బంకు వద్ద తనిఖీ చేపట్టారు.

ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే పట్టుకొని విచారించారు. వారి వద్ద రూ.85 వేల విలువగల ఐదు కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఇందులోని విషయాలని లోతుగా పరిశీలించి ప్రాథమిక విచారణ చేసి గుర్తించడం జరిగిందని, త్వరలోనే ఒక్కొక్కటిగా బయటకు తీసుకువస్తామని అన్నారు. గంజాయి సేవిస్తున్న 42 మంది పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే కఠిన శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. గంజాయి పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు.

First published:

Tags: Crime news, Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు