Home /News /telangana /

WARANGAL GANG ARREST WHO FRAUD WITH FAKE GOLD IN WARANGAL VRY KMM

Warangal : ముందు ఒరిజినల్ గోల్డ్.. ఆ తర్వాతే...అసలు కథ.. అత్యాశకు పోయిన వ్యాపారి.. నెత్తిన టోపి

Warangal , Crime,

Warangal , Crime,

Warangal : నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తూ డబ్బును సంపాదిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్టు చేసారు. అరెస్టు చేసిన ఈ ముఠా సభ్యుల నుండి 10 లక్షల 45వేల నగదుతో పాటు, ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ బంగారు గుండ్ల హారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
  ఈ ముఠా అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన మోహన్‌లాల్ పాత బట్టలను కొనుగోలు వాటిని కొత్తవాటిగా మార్చి కేరళ, తమిళనాడ్, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్మేవారు. ఈ విధంగా నిర్వహించే వ్యాపారం ద్వారా వచ్చే అదాయంతో నిందితుడు మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవాడు. గత సంవత్సరం కరోనా కారణంగా బట్టల వ్యాపారం నడవకపోవడంతో పాటు నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన తన బంధువైన మరో నిందితుడు ధర్మతో కల్సి బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి నకిలీ బంగారాన్ని అందజేసి డబ్బు సంపాదించాలని ప్రణాళికను రూపొందించుకున్నారు.

  ఇందులో భాగంగా నిందితులు రెండు కిలోల రోల్డ్ గోల్డ్ బంగారం గుండ్ల హారాన్ని కొనుగోలు చేసారు.గత అక్టోబర్ మాసం 23వ తేదిన బెంగుళూర్ నుండి వరంగల్ కు చేరుకున్న నిందితులు ఏనమామూల మార్కెట్ ప్రాంతంలో పురుగుల మందుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దుకాణం యజమాన్ని వద్ద వెళ్ళి తాము రోడ్డు పనులు చేసేందుకు వచ్చామని ఇరువురు నిందితులు మారు పేర్లతో పరిచయం చేసుకోని గూలబీ మొక్కలను అవసరమైన పురుగు మందులను కొనుగోలు చేసారు.

  cm kcr meets Stalin : సీఎం స్టాలిన్‌తో సమావేశం అయిన కేసీఆర్.. కూటమి.. సాధ్యమయ్యేనా..?


  నిందితులు మరుసటి రోజు వచ్చి మేము రోడ్డు మరమ్మత్తులు నిర్వహిస్తుండగా బంగారు గుండ్ల హారం దొరికిందని. మా చెల్లెలు పెళ్ళి వుంది కావున డబ్బు అవసరమని దొరికిన బంగారు తక్కువ ధరకు అమ్ముతామని నిందితులు నిజమైన బంగారు గుండును అందజేసి పరీక్షించుకోమని మాయ మాటలతో పురుగుల మందుల షాపు యజమానిని నమ్మించి తమ సెల్ ఫోన్ నంబర్ తెలియజేసి నిందితులు మరుసటి రోజున ఖమ్మంకు వెళ్ళిపోయారు.

  నిందితులు ఇచ్చిన బంగారు గుండు స్వచ్ఛమైన బంగారమని తెలడంతో సదరు వ్యాపారి తక్కువ ధరకు పెద్ద మొత్తంలో బంగారం దొరుకుతుందని ఆశపడి సదరు వ్యాపారి అక్టోబర్ 29వ తేదిన తన భార్యతో కల్సి ఖమ్మం పట్టణంలో నిందితులకు 12 లక్షల అందజేయగా నిందితులు తమ వద్ద వున్న 2కిలోల నకిలీ బంగారం గుండ్ల హారాన్ని వ్యాపారికి అందజేస్తారు. ఇంటికి వచ్చిన గుండ్ల హారాన్ని స్వర్ణకారుడితో పరీక్షించగా అది నకిలీ బంగారం తెలడంతో బాధితుడు తాను మోసపోయాని ఇంతేజా గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

  Book on KTR : మంత్రి కేటిఆర్ యూత్ ఐకాన్... పుస్తకం రాసిన ఉస్మానియా విద్యార్థి...విడుదల చేసిన మంత్రి


  ఈ సంఘటనపై సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితులను గుర్తించడం జరిగింది. నిందితులు వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటూ మరోమారు ప్రజలను మోసం చేసేందుకుగాను ఈ రోజు తిరిగి ఖమ్మం నుండి రైలు ద్వారా వరంగల్ రైల్వే స్టేషను నిందితులు చేరుకున్నట్లుగా సమాచారం రావడంతో ఇంతేజా గంజ్ ఇన్ స్పెక్టర్ మల్లేష్ తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోని తీసుకోని విదారించగా నిందితులు పాల్పడిన మోసాన్ని పోలీసుల ఎదుట అంగీకరించడంతో పాటు పోలీసులు నిందితుల నుండి డబ్బు, నకిలీ బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Warangal

  తదుపరి వార్తలు