హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: 15 పైసల నుండి రూ.7 వరకు.. ఓ ఛాయ్ వాలా విజయగాథ

Warangal: 15 పైసల నుండి రూ.7 వరకు.. ఓ ఛాయ్ వాలా విజయగాథ

X
చాయ్

చాయ్ వాలా ప్రస్థానం

Telangana: ఒక వ్యక్తి 15 పైసలు ఉన్నప్పటి నుండి చాయ్ అమ్ముతున్నాడు. సుమారుగా 50 సంవత్సరాలుగా ఛాయ్ అమ్ముతూనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 15 పైసల నుండి మొదలైన తన ఛాయ్ ప్రస్థానంలో ఇప్పుడు అదే చాయ్ రూ.7కి అమ్ముతున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : వరంగల్

ఒక వ్యక్తి 15 పైసలు ఉన్నప్పటి నుండి చాయ్ అమ్ముతున్నాడు. సుమారుగా 50 సంవత్సరాలుగా ఛాయ్ అమ్ముతూనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 15 పైసల నుండి మొదలైన తన ఛాయ్ ప్రస్థానంలో ఇప్పుడు అదే చాయ్ రూ.7కి అమ్ముతున్నాడు. ఛాయ్ అమ్మే తన పిల్లలని ఉన్నత చదువులు చదివించాడు. వయసు మీద పడినా ఇప్పుడు కూడా ఛాయ్ అమ్ముతున్న ఆ వ్యక్తి.. ఊపిరి ఉన్నత వరకు.. శరీరం సహకరించినంత వరకు చాయ్ అమ్ముతూనే ఉంటానని చెప్తున్నారు.

వరంగల్ కు చెందిన రాజేందర్ కు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. ‘పద్మశాలి ‘ కులవృత్తిలో ఆదాయం లేకపోవడంతో మొదట్లో ఒక హోటల్లో పనిచేశాడు. అయితే 1972లో సొంతంగా తానే చాయ్ దుకాణం పెట్టుకొని మొదటగా ఒక్క చాయ్ 15 పైసలకు అమ్మడం మొదలుపెట్టాడట.

అలా మొదలైన చాయ్ దుకాణం ఇప్పటికీ కొనసాగుతుంది. సుమారు 50 సంవత్సరాల నుండి అల్లం చాయ్ పెట్టడంలో తాను స్పెషలిస్ట్ అని అంటున్నాడు రాజేందర్. రోజురోజుకి అన్నిటికీ రేట్లు పెరగడంతో ఛాయ్ రేటు కూడా పెంచాల్సి వచ్చిందంటున్నాడు.

ప్రస్తుతం ఒక ఛాయ్ 7 రూపాయలకి అమ్ముతున్నాడు. సుమారుగా ఒక రోజుకి 5000 నుండి 6000 వరకు ఛాయ్ లు అమ్ముతాడని అన్నాడు. ఇలా చాయ్ అమ్ముతూ సంపాదించిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని.. తనకున్న నలుగురు పిల్లల్ని ఉన్నతమైన చదువులు కూడా చదివించానని చెప్పాడు. ఒక కుమారుడు సాఫ్ట్ వేర్ కాగా.. ఒక అమ్మాయి ఎంబీఏ చదువుతుంది. మరొక అమ్మాయికి పెళ్లి కూడా చేశాడట. ఇలా చాయ్ అమ్ముతూ జీవనం కొనసాగించడం చాలా గర్వంగా ఉందని అంటున్నాడు రాజేందర్.

First published:

Tags: Local News, Telangana, Warangal

ఉత్తమ కథలు