Santosh, News18, Warangal.
ఆశ్చర్యపరిచేలా ప్రభుత్వ ఆసుపత్రుల తరహాలో కార్పొరేట్ హాస్పిటల్స్ చికిత్స
ఎంతటి గుండె వ్యాధి కైనా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం.
వరంగల్ కాకతీయ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక శాస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో పేదలకు ఖరీదైన వైద్య సేవలు అందిస్తున్నారు. సుమారు 150 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో ఇప్పుడు గుండెకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వందల సంఖ్యలో రోగులు వచ్చి చికిత్స పొందుతున్నారు. నెలకు సుమారుగా 1000 కి పైగా ఏంజియో గ్రామ్ పరీక్షలు అందిస్తున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కార్పొరేట్ ఆసుపత్రిలో సుమారు మూడు లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఇక్కడ ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇటీవల కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధానమంత్రి స్వస్థల సురక్ష యోజన పథకం కింద కేంద్రం ఈ ఆసుపత్రిని మంజూరు చేసింది. ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల ఇక్కడ సిబ్బంది చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారని.. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని.. ఇంకా అభివృద్ధి చేస్తే రోగులకు అధిక సంఖ్యలో సేవలందించవచ్చునని.. ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన పేషెంట్ సుశీల అంటున్నారు.
2021 డిసెంబర్లో గుండెకు సంబంధించిన చికిత్స మొదలుపెట్టారు. జనవరి నెల నుండి రెగ్యులర్గా చికిత్సలు అందిస్తుండగా.. ప్రస్తుతానికి 1000 మందికి చికిత్స అందించారు. అందులో 400 మందికి స్టంట్ లు వేశారు. వైద్యం చేయించుకున్న వారు అందరూ సురక్షంగా ఉంటున్నారని, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
Shraddha Murder Case: 5 కత్తులతో 35 ముక్కలు..శ్రద్ధ వాకర్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..
ఎలాంటి హెల్త్ కార్డ్స్ లేకున్నా ప్రభుత్వ ఆసుపత్రి మాదిరిగా ఎలాంటి రుసుము లేకుండా వైద్యం అందిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంకా కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మమతారెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hospitals, Local News, Telangana, Warangal