హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: "​ధర్మారెడ్డి.. పులిని తట్టి లేపావ్​.. ఇక కాస్కో.. నీ పాపం పండింది..”: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై కొండా సురేఖ ఫైర్​

Warangal: "​ధర్మారెడ్డి.. పులిని తట్టి లేపావ్​.. ఇక కాస్కో.. నీ పాపం పండింది..”: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై కొండా సురేఖ ఫైర్​

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‍లో టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress) శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండా సురేఖ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫైర్​ అయ్యారు.

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‍లో టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress) శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండా సురేఖ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫైర్​ అయ్యారు.

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‍లో టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress) శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండా సురేఖ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫైర్​ అయ్యారు.

ఉమ్మడి వరంగల్​ (Warangal) ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‍లో టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress) కార్యకర్తల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) తల్లిదండ్రుల సమాధులను ధ్వంసం (demolition of the monument) చేయడానికి యత్నించడమే ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమాధుల ధ్వంసానికి పాల్పడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన (demolition of the monument)పై మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) ఫైర్​ అయ్యారు. తన అత్తా మామ సమాధులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Challa Dharmareddy) ఆదేశాలతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యేను కొండా సురేఖ తీవ్రంగా హెచ్చరించారు.

తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే..

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ (Congress Former MLA Konda Surekha) ఘటనపై మాట్లాడుతూ..  ''ధర్మారెడ్డి.. నిద్రిస్తున్న పులిని తట్టి లేపావు. ఇక కాస్కో. ఏం చేస్తావో చేసుకో. కానీ నీ పాపం పండింది. ప్రజలు తిరగబడి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయి. గతంలో మూడు కోట్ల కాంట్రాక్ట్ కోసం మా వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్న సంగతి మరిచావా? గుర్తుపెట్టుకో... కొండాను ఢీ కొట్టడమంటే కొండను ఢీకొట్టినట్లే. మేం ఇక్కడ లేకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావని గుర్తుంచుకో'' అంటూ కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఉమ్మడి వరంగల్​ (Warangal)  అగ్రంపహాడ్లో తమ అత్తామామల సమాధుల వద్ద మూడెకరాల భూమిని (Land) కొనుగోలు చేసినట్లు.. ఇప్పటికీ ఆ భూమి తమ బిడ్డ సుస్మితా పటేల్ పేరుపైనే వుందని కొండా సురేఖ వెల్లడించారు. అత్తామామల స్మారకార్థం ప్రజలకు ఉపయోగకరంగా ఆ స్థలాన్ని మార్చామని.. అక్కడే సమ్మక్క-సారలమ్మ గద్దెలను నిర్మించారని తెలిపారు. ఆ భూమిని దేవాదాయ శాఖకు తాము అప్పగించలేదని.. అలాంటిది అక్కడ తమ అత్తామామల సమాధులను (monument) ఎలా తొలగిస్తారని కొండా సురేఖ మండి పడ్డారు.

గొడవకు కారణమేంటి..?

ఉమ్మడి వరంగల్​ (Warangal)  ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో సమ్మక్క-సారలమ్మ (Sammakka saralamma) గద్దెలున్నాయి. అయితే ఇక్కడ ప్రతి రెండేళ్ళకోసారి ఘనంగా జాతర నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జాతర (jatara) జరగాల్సి వుండగా ఏర్పాట్లకోసం నూతన కార్యవర్గం ఏర్పాటుచేసారు. ఈ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి (MLA Dharma reddyy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్ల గద్దెలను పరిశీలించారు. అయితే గద్దెల పక్కనే వున్న కొండా మురళి తల్లిదండ్రుల సమాధులపై (Tombs) కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే అక్కడినుండి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే కొందరు కొండా తల్లిదండ్రుల సమాధుల ధ్వంసానికి (demolition of the monument) పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని దీన్ని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

First published:

Tags: Fighting, Konda surekha, Trs, TS Congress, Warangal

ఉత్తమ కథలు