ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన రాజశేఖర్ అలియాస్ రాజేష్ నగరంలో ఒక లాయర్ వద్ద గుమాస్తా విధులు నిర్వహిస్తుండేవాడు. తన లాయర్ వద్దకు వివిధ కేసుల్లో నిందితులుగా వున్న వ్యక్తులకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు గాను అవసరమయిన పత్రాలు, పూచికత్తు సంతాకాలను సులభంగా సృష్టించేందుగాను నిందితుడు రాజశేఖర్ మిగితా నిందితులను సంప్రదించేవాడు.
దీనితో మిగితా నిందితులు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన పంచాయితీ రాజ్ విభాగానికి చెందిన రౌండ్ రబ్బర్ స్టాంపులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి పేరు మీదగా హైదరాబాద్లో తయారు చేయించిన రబ్బర్ స్టాంపులను వినియోగించుకోని బెయిల్ కోసం పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల పేర్ల మీద గ్రామ పంచాయితీ కార్యదర్శి జారీ చేసిన రీతిలో దృవీకరణ పత్రం, ఇంటి విలువ, ఇంటి పన్నుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను సృష్టించి నిందితుడు రాజశేఖర్ కు అందజేసేవారు.
Fake CBI : స్పెషల్ 26.. సినిమా చూసి దోపిడి... రియల్ వ్యాపారి వద్ద పనిచేసే వ్యక్తి సూత్రదారి
నిందితులు బెయిల్ పత్రాలను కోర్టుకు అందజేసే సమయంలో ఫోర్జరీ పత్రాలతో పాటు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల ఆధార్‌కార్డులతో పాటు సదరు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తులు న్యాయమూర్తి ముందు హజరయ్యేవారు. ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక సుబేదారి పోలీసుల కల్సి సుబేదారి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు రవీందర్ వాహనాన్ని అపి పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద అనధికారికంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి, పంచాయితీ రాజ్ విభాగానికి సంబంధించి రౌండ్ షీల్డ్ రబ్బర్ స్టాంపులతో పాటు, ఇంటి విలువ, ఇంటి పన్ను రశీదులు దొరకడంతో నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించారు.
Khammam trs : ఖమ్మం జిల్లా తెరాసలో మళ్లీ ఫ్లెక్సీల లొల్లి.. ఆ నేతలిద్దరి మధ్య ముదురుతున్న వివాదం
ఈ ఫోర్జరీ పత్రాల వ్యహరాన్ని కోర్టు అధికారుల దృష్టికి తీసుకపోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ఫ ర్స్ ఇన్స్ స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్ జీ, సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్, టాస్క్ఫ ర్స్ ఎస్.ఐలు లవణ్ కుమర్, రవళి, సుబేదారి ఎస్.ఐ. పున్నం చందర్ ,టాస్క్ఫర్స్ హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుల్లు రాజేష్, రాజు, శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, ఆలీ, హోంగార్డ్ విజయ్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.