మహబూబాబాద్ mahabubabad జిల్లాలో మరోసారి ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా బయటపడింది. కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్(Food poisoning)కావడంతో 43మంది విద్యార్ధినులు(Girls) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ( Wednesday)రాత్రి నుంచే విద్యార్ధినులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ఈ విషయాన్ని బయటకుపొక్కనివ్వకుండా డాక్టర్లనే కస్తుర్బా పాఠశాలకు పిలిపించి రహస్యంగా వైద్యం చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది.
విద్యార్దినులకు అస్వస్థత..
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్ధినుల ప్రాణాల్లో గాల్లో దీపాల్లా మారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తుర్బా పాఠశాలలో బుధవారం రాత్రి నుంచి 43మంది విద్యార్ధినులు అస్వస్తతకు గురయ్యారు. కడుపు నొప్పి, ఇతర సమస్యలో బాధపడుతుంటే పాఠశాలలో సిబ్బంది, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారి పరిస్థితి మరింత విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. అయితే గత రాత్రి నుంచి విద్యార్ధినులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండటంతో వైద్యులను కస్తూర్బా పాఠశాలకు పిలిపించి ..ట్రీట్‌మెంట్ ఇప్పించారు. విషయం బయటకు రానివ్వకుండా ప్రయత్నించారు.
స్కూల్‌లోనే సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్..
విషయం అందరికి తెలిసిపోవడంతో హుటాహుటిన విద్యార్ధినులను రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే అస్వస్థతకు కారణం కలుషిత నీరా లేక ఫుడ్ పాయిజన్ వల్లనా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న స్టూడెంట్స్‌లో కొందరు కడుపు నొప్పితో బాధపుడుతుంటే మరికొందరు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నారు.
ఆలస్యంగా బయటపడ్డ నిజం..
విద్యార్ధినులకు ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. మరికొంత సమయం అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారు. స్టూడెంట్స్ అస్వస్థకు గురైన విషయాన్ని కస్తూర్బా .పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడం, తల్లిదండ్రులకు సమాచారం చేరవేయకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటనపై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Foods, Mahabubabad, Telangana News