పెద్ద పెద్ద నగరాల్లో ఇటీవల అగ్నిప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోవడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగి.. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కోట్ల రూపాయల నష్టమూ జరుగుతోంది. తాజాగా వరంగల్ (Warangal Fire Accident)లో కూడా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఇసుక అడ్డా కూడలిలో ఉన్న ఓ పాత దర్వాజాలు, కిటికీల గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అన్ని కలప వస్తువులే ఉండడంతో.. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్ ఫర్టిలైజర్ షాపు, బైక్ రిపేర్ సెంటర్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ. భారీగా మంటలు ఎగిసిపడడంతో.. స్థానికల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు.
Hyderabad: హైదరాబాద్‌కు చేరుకున్న ఈ-రేసింగ్ కార్లు.. ఫిబ్రవరి 11న మెగా ఈవెంట్
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. 12 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఉదయం 8 గంటల వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఆ తర్వాత క్రమంగా తగ్గముఖం పట్టాయి. ఈ ఘటనలో దాదాపు కోటి రూపాయల విలువైన ఫర్నిచర్ కాలిబూడిదయిందని స్థానిక వ్యాపారులు తెలిపారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు... వారిని అడిగి.. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఐతే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే.. మంగలు చెలరేగి ఉండవచ్చని.. అనుమానిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ ఏసిపి గిరి కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోనూ ఇటీవల ఘోర ప్రమాదం (Hyderabad Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లోని దక్కన్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు వలస కార్మికులు..సజీవ దహనమయ్యారు. మంటల్లో కాలి బూడిదయ్యారు. గుర్తు పట్టలేని విధంగా శవాలు కాలిపోయాయి. దాదాపు 12 గంటల పాటు మంటలు ఎగిసిపడడంతో.. భవనం మొత్తం శిథిలమైంది. ఈ మధ్యే ఆ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. నగరం నడి బొడ్డున.. అది కూడా జనావాసాల మధ్య ప్రమాదం జరగడంతో.. అలాంటి భవనాలపై భవనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఫైర్ సేఫ్టీ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal